స్వర్ణప్యాలెస్‌ అగ్ని ప్రమాద వ్యవహారంలో సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం

Andhra Pradesh Vijayawada Coronavirus, COVID facility fire mishap, Petition in Supreme Court over Swarna Palace Fire Accident, Swarna Palace Fire Accident, Swarna Palace Fire Accident Issue, Swarna Palace hotel, Vijayawada Co, Vijayawada Fire Accident News, Vijayawada hotel fire acident

విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి రమేష్‌ ఆసుపత్రి పై చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ ప్రమాదానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోకుండా రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని కోరారు. ఆసుపత్రి నిర్వహణలో లోపాలున్నాయని, ప్రమాద ఘటనపై యాజమాన్యం దర్యాప్తునకు సహకరించడం లేదని పిటిషన్ లో పేర్కొన్నారు.

ముందుగా విజయవాడలో రమేష్ ఆసుపత్రి ఆధ్వర్యంలో కోవిడ్ కేర్ సెంటర్ గా వినియోగించిన స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో ఇటీవలే భారీ అగ్ని ప్రమాదం జరిగి 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వ్యవహారంలో రమేశ్‌ ఆస్పత్రి ఎండీ రమేశ్‌ బాబు, ఛైర్మన్‌ సీతారామ్మోహన్‌రావుపై పోలీసులు కేసు నమోదు చేయగా, వారిద్దరూ‌ హైకోర్టును ఆశ్రయించారు. తమపై నమోదైన కేసును కొట్టేయాలంటూ కోరగా, విచారణ జరిపిన హైకోర్టు వారిపై తదుపరి చర్యలు నిలిపివేయాలంటూ మధ్యంతర ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలోనే వారిపై చర్యలు తీసుకునేందుకు అనుమతించాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + twelve =