శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో నేడే కీలక ఘట్టం, సమతామూర్తి విగ్రహాన్ని జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోదీ

Inauguration of Samatha Murthy Statue, Mango News, Muchintal, Narendra Modi To Inaugurate The Statue of Equality, PM Modi, PM Modi will Dedicate to the Nation the Statue of Equality, PM Modi will Dedicate to the Nation the Statue of Equality in Hyderabad, PM Modi will Dedicate to the Nation the Statue of Equality in Hyderabad Today, pm narendra modi, ramanuja statue inauguration, Ramanujacharya Millennium Celebrations, ramanujacharya statue in hyderabad, Samatha Moorthi Sri Ramanujacharya Statue, Samatha Murthy Statue, Statue of Equality, Statue of Equality in Hyderabad, statue of equality inauguration, Statue of Equality Sri Ramanujacharya

హైదరాబాద్ నగర శివారు ముచ్చింతల్‌ లో శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 2 నుంచి 14వ తేదీ వరకు 12 రోజుల పాటుగా జరగనున్న ఈ ఉత్సవాల్లో అన్నికార్యక్రమాలు త్రిదండి శ్రీ చినజీయర్ స్వామి పర్యవేక్షణలో జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్సవాల్లో భాగంగా నాలుగోరోజైన ఫిబ్రవరి 5, శనివారం నాడు కీలక ఘట్టం జరగనుంది. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద విగ్రహం, 216 అడుగుల ఎత్తు గలిగిన పంచలోహ శ్రీరామానుజాచార్య విరాట్ (సమతామూర్తి) విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు జాతికి అంకితం చేయనున్నారు. ప్రధాని మోదీ శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల్లో నేటి సాయంత్రం 5 గంటల నుంచి దాదాపు మూడుగంటల పాటుగా పాల్గొననున్నారు. సాయంత్రం 7 గంటలకు ప్రధాని మోదీ సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణ చేయనున్నారు. మరోవైపు ప్రధాని పర్యటనలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సహా పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు.

ముచ్చింతల్‌ లో ప్రధాని మోదీ పర్యటన వివరాలు:

  • సాయంత్రం 4:30 గంటలకు హెలికాఫ్టర్ లో ముచ్చింత‌ల్‌ కు రాక.
  • 5 గంటలకు ముచ్చింత‌ల్‌ లో శ్రీచినజీయ‌ర్ స్వామి ఆశ్ర‌మం శ్రీరామనగరానికి ప్రధాని చేరుకుంటారు.
  • 5.15 గంటలకు యాగశాలకు చేరుకుంటారు. 6 గంటలకు విశ్వక్ సేనుడి పూజలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు.
  • 6.05 నుంచి 6.35 గంటల వరకు 108 ఆలయాలతో నిర్మించిన దివ్యదేశ ఆలయాల సమూహాన్ని ప్రధాని సందర్శించనున్నారు.
  • 6.35 గంటలకు సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన.
  • సాయంత్రం 7 గంటలకు 216 అడుగుల‘సమతామూర్తి’ విగ్రహాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. తదనంతరం ఒక అరగంట పాటు ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.
  • 7.30 నుంచి 8.05 వరకు శ్రీరామానుజచార్యుల విగ్రహంపై 15 నిమిషాలపాటు 3డీ లైటింగ్ ప్రదర్శన వీక్షణ, అనంతరం మరోసారి యాగశాలకు చేరుకుని శ్రీలక్ష్మీనారాయణ యాగ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొంటారు.
  • 8.20 కు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి పయనమవనున్నారు.

శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల్లో నాలుగో రోజు కార్యక్రమాలు:

  • ఇష్టిశాలలో విజయప్రాప్తికై – విష్వక్సేనేష్టి
  • ఇష్టిశాలలో విద్యాప్రాప్తికై – శ్రీహయగ్రీవేష్టి
  • ప్రవచనమండపమంలో శ్రీవేంకటేశ అష్టోత్తరశత నామపూజ, ప్రవచనములు
  • బద్రవేదిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీచే శ్రీరామానుజ 216 అడుగుల విగ్రహ ఆవిష్కరణ
  • ప్రవచనమండపమంలో ముఖ్యఅతిథుల సందేశములు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + five =