నెల్లూరులోని మ్యూజిక్‌, డ్యాన్స్‌ ప్రభుత్వ పాఠశాలకు‌ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు

A Tribute To SP Balu By AP Govt, Andhra Pradesh Government, AP Govt Fitting Tribute To Legendary SPB, AP News, Balasubrahmanyam, Government Music school in AP renamed after SPB, late singer SP Balasubrahmanyan, Mango News Telugu, Music school in AP renamed after SPB, SP Balasubrahmanyam, Tribute To SP Balasubrahmanyam

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సంగీతానికి గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అందించిన సేవలకు గుర్తుగా నెల్లూరులోని మ్యూజిక్‌, డ్యాన్స్‌ ప్రభుత్వ పాఠశాలకు ఆయన పేరుపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై ఆ పాఠశాలపేరును డాక్టర్‌ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మ్యూజిక్‌, డ్యాన్స్‌ ప్రభుత్వ పాఠశాలగా మారుస్తునట్టు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు మ్యూజిక్‌, డ్యాన్స్‌ పాఠశాలకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు పెట్టడం పట్ల ఆయన కుమారుడు ఎస్పీ చరణ్‌ అనందం వ్యక్తం చేశారు. తన తండ్రికి ఈ గౌరవం అందించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ‌మోహన్ ‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + fourteen =