ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ హరికిషన్ కన్నుమూత

Artist Hari Kishan Passed Away, Famous Mimicry Artist Hari Kishan, Famous Mimicry Artist Hari Kishan Passed Away, Mimicry Artist Hari Kishan, mimicry artist hari kishan death, Mimicry Artist Hari Kishan Passed Away, Mimicry artist Harikishan is no more, telugu mimicry artist hari kishan died

ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్, నటుడు హరి కిషన్ కన్నుమూశారు. ఆయన వయసు 57 సంవత్సరాలు. గత కొద్దీ రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. హరికిషన్‌ మే 30, 1963 లో ఏలూరులో జన్మించారు. చిన్నతనం నుంచే మిమిక్రీ చేయడం మొదలుపెట్టిన ఆయన ఈ విద్యలో ఎంతో పేరు ప్రఖ్యాతలు గడించారు.

సినిమా రంగం, రాజకీయ రంగ ప్రముఖుల గొంతులను, హావభావాలను హరి కిషన్ అలవోకగా, అద్భుతంగా అనుకరించేవారు. శబ్దాలను, జంతువులు, పక్షుల కూతలను కూడా గొప్పగా అనుకరించేవారు. మన రాష్ట్రంలోనే కాక విదేశాల్లో ఎన్నో మిమిక్రీ ప్రదర్శనలు ఇచ్చారు. అలాగే ఆయన పలు సినిమాల్లోనూ నటించారు. ఎంతో మంది తన శిష్యులను మిమిక్రీలో గొప్పగా మలిచారు. హరికిషన్ మృతి తెలుగు వారికి, ఆయన అభిమానులకు తీరని విషాదాన్ని మిగిల్చింది. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, శిష్యులు, అభిమానులు సంతాపం తెలుపుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here