తీవ్ర ఉద్రిక్తంగా రైతుల ‘చలో ఢిల్లీ’ కార్యక్రమం

Bharat Bandh Farmers protest live updates Delhi, Chalo Dilli Agitation, Delhi Chalo Agitation, Delhi Chalo protest, Dilli Chalo Movement, Farmers Call For Chalo Dilli Agitation, Farmers march, Farmers Protest Today Live Updates, Mango News, March To Delhi Against Three Farm Bills, New Agriculture Acts, Protest Against Centre New Agriculture Acts, Punjab And Haryana Farmers Call For Chalo Dilli Agitation

కేంద్రప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఆందోళన ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుంది. పంజాబ్, హర్యానాకు చెందిన రైతు సంఘాలు, రైతులు గురువారం తలపెట్టిన ‘చలో ఢిల్లీ’ కార్యక్రమం రెండో కూడా కొనసాగుతుంది. రైతులను ఢిల్లీలోకి ప్రవేశించకుండా ఢిల్లీ-హర్యానా బోర్డర్ ప్రాంతమైన సింఘు వద్ద బారికేడ్లు అడ్డుపెట్టి నిలిపేశారు. ఈ రోజు బారికేడ్లను దాటుకుని వెళ్లేందుకు రైతులు ప్రయత్నించడంతో పోలీసులు, రైతులకు మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకోని ఆ ప్రాంతమంతా రణరంగాన్ని తలపించింది. రైతులను ముందుకెళ్ళకుండా నిలువరించేందుకు పోలీసులు బాష్పవాయువును, వాటర్‌కెనన్లు ప్రయోగించారు. అయినప్పటికీ వెనక్కి తగ్గకుండా ఢిల్లీకి వెళ్లేందుకే రైతులు సిద్ధమయ్యారు.

అయితే ఢిల్లీ సరిహద్దు ప్రాంతమైన సింఘు వద్ద గంటల తరబడిగా రైతుల ఆందోళన అనంతరం వారిని ఢిల్లీ నగరంలోకి ప్రవేశించడానికి ఢిల్లీ పోలీసులు అనుమతించారు. రైతులంతా పోలీస్ సిబ్బంది పహారాలోనే కవాతు చేయాలని షరతులు విధించారు. దీంతో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వేలాది రైతులు ఢిల్లీకి చేరుకునే అవకాశముంది. అలాగే రైతులు రామ్ లీలా మైదానానికి చేరుకొని కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపనున్నట్టు సమాచారం. మరోవైపు రైతుల నిరసన నేపథ్యంలో వారిని అరెస్ట్ చేయాల్సి వస్తే నగరంలోని తొమ్మిది స్టేడియాలను తాత్కాలిక జైళ్లుగా మార్చాలని కోరుతూ ఢిల్లీ పోలీసులు చేసిన అభ్యర్థనను ఢిల్లీ ప్రభుత్వం తిరస్కరించింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − seven =