గ్రామ సచివాలయాల్లో ఉద్యోగులకు ఊరట.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం..

AP Govt Takes Key Decision To Withdraw BLO Duty From Village and Ward Secretaries,AP Govt Takes Key Decision To Withdraw BLO Duty,BLO Duty From Village and Ward Secretaries,Key Decision To Withdraw BLO Duty,Mango News,Mango News Telugu,Employees in village secretaries, Jagan Sarkar, key decision,BLO responsibilities ,Engineering assistants, Welfare secretaries, Government's voter list revision,BLO Duty Latest News,BLO Duty Latest Updates,Village and Ward Secretaries Latest News,Ward Secretaries Latest Updates

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రారంభించిన గ్రామ, వార్డు సచివాలయాలు ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రజలకూ, ప్రభుత్వానికీ మధ్య వారధిగా పనిచేస్తున్నాయి. ఇందులో ప్రతీ సచివాలయంలోనూ వివిధ విభాగాల వారీగా ప్రత్యేకంగా 12 మంది అసిస్టెంట్లు పనిచేస్తున్నారు. వీరికి మొదట్లో సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు సక్రమంగా అందేలా చూసే బాధ్యత ఒక్కటే ఉండేది. ఆ తర్వాత క్రమంగా వీరిపై పని ఒత్తిడి పెరుగుతూ పోయింది. దీంతో వారు గగ్గోలు పెడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, సంక్షేమ కార్యదర్శులకు ప్రభుత్వం తాజాగా ఓటర్ల జాబితా సవరణ సందర్భంగా బీఎల్వో బాధ్యతలు అప్పగించింది. ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో జవాబుదారీతనం ఎక్కువగా ఉంటుందన్న ఆలోచనతో ఈ బాధ్యతలు కట్టబెట్టింది. అయితే అప్పటికే వివిధ పనులతో క్షణం తీరికలేకుండా ఉంటున్న వీరికి బీఎల్వో బాధ్యతలు మరింత భారంగా మారాయి. అలాగని ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించే పరిస్థితి లేదు. దీంతో ప్రభుత్వాన్ని బీఎల్వో బాధ్యతల నుంచి విముక్తి కల్పించాలని వీరు కోరుతున్నారు.

దీనిపై పరిశీలన చేసిన ప్రభుత్వం ముందుగా గ్రామ సచివాలయాల్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్లను బీఎల్వో బాధ్యతల నుంచి విముక్తి కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం కింద రాష్ట్రంలో జరుగుతున్న పలు పనుల్లో బిజీగా ఉంటున్న వీరిని బీఎల్వో బాధ్యతల నుంచి మినహాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు బీఎల్వో విధుల బాధ తప్పినట్లయింది.

అయితే సంక్షేమ కార్యదర్శులు కూడా తమను బీఎల్వో బాధ్యతల నుంచి తప్పించాలని కోరుతున్న నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వానికి కీలకమైన సంక్షేమ పథకాల అమలు బాధ్యత చూస్తున్న వీరికి బీఎల్వో బాధ్యతలు అప్పగించడం వల్ల పథకాల అమలుపై ఆ మేరకు ప్రభావం పడుతుందన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సంక్షేమ కార్యదర్శుల్ని కూడా బీఎల్వో బాధ్యతల నుంచి మినహాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని సచివాలయాల్లో బీఎల్వో బాధ్యతలు అప్పగించిన వారి వివరాలను ప్రభుత్వం తెప్పించుకుని పరిశీలిస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × one =