ఆప్ఘాన్‌తో తొలి టీ20 ఫస్ట్ మ్యాచ్ కు విరాట్ దూరం..

Virat Away From The First T20 First Match Against Afghanistan, T20 First Match Against Afghanistan, Virat Away From The First T20, Afghanistan First T20 Match, IND vs AFG, India vs Afghanistan, 1st T20, Virat Kohli, Kohli, Rohit in T20 series, Rohit Sharma, Shubman Gill, India, BCCI, Mango News Telugu
IND vs AFG,India vs Afghanistan, 1st T20I, Virat Kohli, Kohli, Rohit in T20 series,Rohit Sharma, Shubman Gill,

జనవరి 11న అంటే ఈ రోజు నుంచి భారత్, ఆఫ్ఘనిస్థాన్  టీమ్‌ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. సిరీస్‌లో ఫస్ట్  మ్యాచ్ మొహాలీలో ఈ రోజు  జరగనుంది.అయితే ఈ సిరీస్‌కు ఓ స్పెషాలిటీ ఉందని క్రికెట్ లవర్స్ తెగ ఖుషీ అవుతున్నారు. ఎందుకంటే టీమిండియాలోని ఇద్దరు వెటరన్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్ ఇయర్ తర్వాత T20 ఇంటర్నేషనల్‌కి తిరిగి వస్తున్నారు.

కానీ ఈ ఫస్ట్ టీ20లో రోహిత్ శర్మ ఒక్కడినే చూసే అవకాశం ఉండటంతో ఫ్యాన్స్ కొంచెం డిజప్పాయింట్ అవుతున్నారు. ఎందుకంటే సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు  కింగ్ విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండడని మ్యాచ్‌కు ఒకరోజు ముందే కోచ్ రాహుల్ ద్రావిడ్ ఎనౌన్స్ చేశాడు.పర్సన్ రీజన్స్  వల్ల విరాట్ కోహ్లీ తొలి టీ20 మ్యాచ్‌లో ఆడడం లేదని..కానీ రెండో, మూడో టీ20 మ్యాచ్‌లకు  అందుబాటులో ఉంటాడని  రాహుల్ ద్రావిడ్ చెప్పాడు.

నిజానికి నవంబర్ 2022లో జరిగిన టీ20 వరల్డ్ కప్  తర్వాత.. విరాట్ కోహ్లీ  టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడలేదు. అడిలైడ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20  వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో కోహ్లీ హాఫ్ సెంచరీ కొట్టాడు. అయితే, ఆ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయి టీ20 ప్రపంచకప్‌ మిస్ చేసుకున్నారు. అప్పటి నుంచే కింగ్  కోహ్లీ ఫార్మాట్‌కు దూరంగా ఉంటున్నాడు.

14 నెలలుగా ఈ ఫార్మాట్‌కు దూరంగా ఉన్న కోహ్లీని చూడడానికి ఫ్యాన్స్ తహతహలాడుతున్నారు. అటు కోహ్లీలాగే 14 నెలల తర్వాత ఈ ఫార్మాట్‌లోకి  ఎంట్రీ ఇస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తొలి మ్యాచ్‌లోనే రీ ఎంట్రీ ఇస్తున్నాడు.  రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యస్సవి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్ ఈ మ్యాచ్‌కు ఆడుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + 18 =