మాయమైన క్రీడా స్ఫూర్తి

Discrimination By Not Giving A Medal To A Black Girl New Facts Come To Light,Discrimination By Not Giving A Medal,Medal To A Black Girl,New Facts Come To Light,Mango News,Mango News Telugu,Gymnastics Ireland,Medal Ceremony, Discrimination ,Not Giving A Medal To A Black Girl,Black Girl,Gymnastics Federation Of Ireland,Black Girl Snubbed,Gymnastics Ireland Apologizes,Racial Discrimination,Black Girl Discrimination Latest News,Black Girl Discrimination Latest Updates

ఒక్కోసారి మరుగున పడిపోయిన ఎన్నో విషయాలు సోషల్ మీడియా పుణ్యమా అని మరోసారి వెలుగులోకి వస్తాయి. ఎప్పుడో జరిగిన సంఘటనలను గుర్తు చేస్తూ మనుష్యుల గుణాన్ని మరోసారి ప్రపంచం ముందుకు చాటుతుంది. అచ్చంగా గతేడాది అలాగే జరిగిన ఓ ఘటన ఫోటో రూపంలో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
విద్వేషాలు, వివక్షకు తావు లేకుండా క్రీడాస్ఫూర్తిని చాటాల్సిన వేదికపై..పోటీలో విజేత అయిన ఓ చిన్నారి దారుణమైన వివక్షకు గురయింది. కేవలం జాతీయత కారణంగానే ఆ పతకాన్ని తాను అందుకోలేకపోయింది.తన తోటి చిన్నారులంతా మెడలో పతకాలు వేసుకుని సంతోషంగా ఫోటోలకు పోజులిస్తుంటే.. తాను మాత్రం అర్ధం కానీ అయోమయానికి లోనయి..అమాయకంగా వారివైపు తొంగి చూస్తున్న దృశ్యాలు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఐర్లాండ్‌ జిమ్నాస్టిక్స్‌ పోటీల్లో గత సంవత్సరం చోటుచేసుకున్న ఆ అనైతిక ఘటనను ఎవరు వెలుగులోకి తీసుకువచ్చారో కానీ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతోంది.

ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో 2022 మార్చిలో జిమ్నాస్టిక్‌ పోటీలు జరగగా.. టోర్నీ తర్వాత అందులో గెలిచిన వారికి పతకాలను అందజేశారు. అయితే, చిన్నారుల విభాగంలో వారికి మెడల్స్‌ అందజేసిన ఓ మహిళా ప్రతినిధి.. తన బుద్ధిని బయటపెట్టి జాతి వివక్షకు పాల్పడింది. మెడల్స్ తీసుకోవాల్సిన చిన్నారులంతా ఒక వరుసలో నిల్చోగా.. వారి మధ్యలో నిల్చున్న ఓ నల్లజాతి బాలికకు పతకం ఇవ్వలేదు. గెలిచిన వాళ్లల్లో ఆ అమ్మాయి ఒక్కతే నల్లజాతి బాలిక కావడంతో..తనను పట్టించుకోకుండా మిగతా చిన్నారులకు మెడల్స్‌ అందించి ఆ ప్రతినిధి.. అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే, వివక్ష అంటే ఏంటో కూడా అర్ధం తెలియని ఆ పాప.. తనకు పతకం ఎందుకు ఇవ్వలేదో అర్థం కాకపోవడంతో.. అయోమయంగా నిల్చుంది. ఇప్పుడు ఈ ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

ఐర్లాండ్‌ జిమ్నాస్టిక్‌ ఫెడరేషన్‌ తీరుపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై స్పందించిన అమెరికా జిమ్నాస్టిక్‌ స్టార్‌ సిమోన్‌ బైల్స్‌ ..ఈ వీడియో చూసి తన హృదయం ముక్కలైందని చెప్పుకొచ్చారు. క్రీడల్లో ఎలాంటి జాతివివక్షకు తావు ఉండకూడదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు విమర్శల ఎక్కువ అవడంతో..ఐర్లాండ్‌ జిమ్నాస్టిక్‌ ఫెడరేషన్‌ దీనిపై ఆ బాలికకు బేషరతుగా క్షమాపణలు చెప్పింది. ఆ ఘటన వల్ల ఆ బాలిక, ఆమె కుటుంబం పడిన ఇబ్బందికి తాము క్షమాపణలు తెలియజేస్తున్నామని తెలిపింది. జరిగినదానికి తాము పశ్చాత్తాపడుతున్నామని చెప్పింది. ఇలాంటి ఘటన అసలు జరిగి ఉండాల్సింది కాదని.. వివక్ష ఏ రూపంలో జరిగినా కూడా తాము దాన్ని సహించబోమని ఐర్లాండ్‌ జిమ్నాస్టిక్‌ ఫెడరేషన్‌ ప్రకటించింది.
అంతేకాదు 2022 మార్చిలో ఈ ఘటన జరగగా వెంటనే జరిగిన పొరబాటును గుర్తించి.. దాన్ని సరిదిద్దుకున్నట్లు ఐర్లాండ్‌ జిమ్నాస్టిక్‌ ఫెడరేషన్‌ చెప్పింది. ఆరోజు బాలిక మైదానాన్ని వీడేలోపే తన పతకాన్ని తనకు అందజేసినట్లు తెలిపింది. దానితో పాటు ఆ బాలికకు..తన కుటుంబానికి లిఖితపూర్వకంగా క్షమాపణలు కూడా చెప్పినట్లు చెప్పింది. కానీ ఆ క్షమాపణలను అంగీకరించని బాలిక కుటుంబం న్యాయపరమైన పోరాటానికి దిగినట్లు ఐర్లాండ్‌ జిమ్నాస్టిక్‌ ఫెడరేషన్‌ వెల్లడించింది. సుదీర్ఘ చర్చల తర్వాత,రెండు పక్షాల మధ్య రాజీ కుదరడంతో ఈ వివాదం అప్పుడే సద్దుమణిగినట్లు చెప్పింది. అంతేకాదు ఈ ఘటనకు కారణమైన ఫెడరేషన్‌ సభ్యురాలిని వెంటనే విధుల నుంచి తొలగించినట్లు కూడా చెప్పుకొచ్చింది ఐర్లాండ్‌ జిమ్నాస్టిక్‌ ఫెడరేషన్‌.

మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + seven =