నేను ఏ తప్పు చేయలేదు, దర్యాప్తుకి భయపడేదే లేదు

Chandrababu About YCP Govt Probe,Mango News,Nara Chandrababu Naidu About YSRCP Government Probe,Not afraid of any probe by YSRCP govt says ex-Andhra CM Chandrababu Naidu,Not afraid of any probe says Chandrababu Naidu,Chandrababu Naidu Latest News,Andhra Pradesh Latest News,Andhra Pradesh CM Jagan Mohan Reddy hints at CBI probe into TDP govt decisions

టిడీపీ అధినేత,ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు తాను ఎటువంటి తప్పు చేయలేదని,అందువల్ల ప్రభుత్వం చేపట్టే ఎటువంటి దర్యాప్తు కైనా భయపడేది లేదని అన్నారు. తన సొంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లాలోని కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు రోజుల పాటు పర్యటించించి,ప్రజలను ఉద్దేశించి ఒక సభ లో ప్రసంగించారు.ఒక ముఖ్యమంత్రి గా ప్రజల కోసం సమస్యలను పరిష్కరించడానికి మరియు రాష్ట్ర అభివృద్ధికి తాను చేయగలిగినదంతా చేశానని వివరించారు. ఈ సందర్బంగా నేను ఏమి తప్పు చేశానో చెప్పాలని ప్రజలని అడిగారు.

ఎన్నికలలో వైసీపీ పార్టీ విజయం సాధించిన కూడా, గత టిడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో సంపద సృష్టి కోసం ఎంతో కష్టపడింది అని, అలా ప్రభుత్వం చేసిన వివిధ ప్రయత్నాల ఫలాలు ప్రజలకు చేరాయని చెప్పారు. అంతే కాకుండా ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ పథకాలు సమాజంలోని ఎటువంటి తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చాయి అని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ ఆధ్వర్యంలో కియా కంపెనీ తన ప్లాంట్ ని అనంతపురంలో ఏర్పాటు చేసిందని,హెచ్‌సిఎల్ మరియు అనేక ఇతర సంస్థలని అమరావతి కి తీసుకువచ్చామని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here