సానియా మిర్జాకు షాకిచ్చిన షోయబ్.. పాక్ నటితో మూడో పెళ్లి

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్.. స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మిర్జా వివాహ బంధానికి వీడ్కోలు చెప్పబోతున్నారంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇద్దరూ విడిపోబోతున్నారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. కొన్నిసార్లు ఏకంగా ఇద్దరూ విడిపోయారని.. విడాకులు కూడా తీసుకున్నారని కూడా ప్రచారం జరిగింది. రెండు మూడు రోజుల క్రితం ఈ వార్తలపై స్పందించిన సానియా మిర్జా.. ‘పెళ్లి కష్టం, విడాకులు కష్టం.. మీరు కఠినంగా ఉండి, సరైన నిర్ణయాన్ని తీసుకోండి’ అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇంతలోనే షోయబ్ మాలిక్ మరో పెళ్లి చేసుకోవడం సంచలనంగా మారింది.

2010లో తన మొదటి భార్య ఆయేషా సిద్ధిఖికు షోయబ్ మాలిక్ విడాకులిచ్చారు. అదే సమయంలో కామన్ ఫ్రెండ్స్ ద్వారా షోయబ్, సానియాలకు మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారి.. పరిచయమయిన కొద్దిరోజులకే ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. దుబాయ్‌లో వీరి పెళ్లి అత్యంత గ్రాండ్‌గా జరిగింది. కొన్నేళ్ల పాటు ఇద్దరూ దుబాయ్‌లోనే కాపురం పెట్టారు. అయితే పరిచయమైన కొన్ని నెలల్లోనే పెళ్లి చేసుకోవడంతో పాటు పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో అప్పట్లో వారిపై మిశ్రమ స్పందన వచ్చింది.

ఇక 2018లో వారికి ఓ కుమారుడు కూడా జన్మించారు. అయితే కొద్దిరోజులుగా వారిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని.. విడాకులు తీసుకొని విడిపోబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నిజానికి వారిద్దరూ విడిపోయారా.. విడాకులు తీసుకున్నారా అనేది ఎవరికీ క్లారిటీ లేదు. ఇంతలోనే షోయబ్ మాలిక్ మూడో పెళ్లి చేసుకున్నారు.

పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ నటి సనా జావేద్‌ను షోయబ్ మూడో  పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని షోయబ్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అటు సనా జవెద్‌కి కూడా ఇది రెండో పెళ్లి. 2020లో సనా పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ సింగర్‌ ఉమైర్ జస్వాల్‌ను పెళ్లి చేసుకున్నారు. వారిద్దరి మధ్య విభేదాలు రావడంతో ఇద్దరూ 2023లో విడాకులు తీసుకొని ఎవరి దారి వారు చూసుకున్నారు. ఆ తర్వాత సనాకు షోయబ్ మాలిక్‌తో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకున్నారు. మరి ఈ పెళ్లిపై సానియా మిర్జా ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − three =