అంగన్ వాడీల్లో 5905 వర్కర్లు, హెల్పర్ల పోస్టుల భర్తీ, జిల్లాల వారీగా నోటిఫికేషన్లు

5905 Anganwadi Posts, 5905 Anganwadi Posts Across the State, Anganwadi Posts in AP, AP Anganwadi, AP Anganwadi Jobs, AP Anganwadi Jobs 2020, AP Anganwadi Recruitment 2020, AP Govt to Recruit 5905 Anganwadi Posts, AP Recruitment 2020, Latest Anganwadi Notifications, WDCW Jobs in AP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో వర్కర్లు, హెల్పర్ల పోస్టుల భర్తీ జరుగుతుంది. జిల్లావారీగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీల ద్వారా ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ జరుగుతుంది. దశలవారీగా దరఖాస్తులను ఆహ్వానించి, ఇంటర్వ్యూలు నిర్వహించి నియామక పక్రియ చేపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5905 వర్కర్లు, హెల్పర్ల పోస్టులు భర్తీ కానున్నాయి. మెయిన్‌ అంగన్‌వాడీల్లో 1,468 మంది వర్కర్లు, మినీ అంగన్‌వాడీల్లో 430 మంది వర్కర్లుతో పాటుగా మొత్తం 4,007 మంది అంగన్‌వాడీ హెల్పర్లును కూడా భర్తీ చేయనున్నారు.

ఇకపై రాష్ట్రంలో అంగన్‌వాడీ కేంద్రాలను ప్రీ ప్రైమరీ కేంద్రాలుగా మార్చాలని ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అంగన్‌వాడీల్లో అన్ని సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది. ఈ క్రమంలోనే అంగన్‌వాడీల్లో ఖాళీలను గుర్తించి పారదర్శక పద్ధతిలో పోస్టుల భర్తీకి అధికారులు చర్యలు చేపడుతున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here