పోలవరం, ధవళేశ్వరం బ్యారేజ్‌ల వద్ద హై అలర్ట్‌, పలు జిల్లాల పరిధిలో తీవ్ర ప్రభావం

AP High Alert at Polavaram and Dhavaleshwaram Barrages Due To Heavy Flood Surge, AP High Alert at Dhavaleshwaram Barrage Due To Heavy Flood Surge, AP High Alert at Polavaram Barrage Due To Heavy Flood Surge, High Alert at Polavaram and Dhavaleshwaram Barrages, Polavaram and Dhavaleshwaram Barrages, Dhavaleshwaram Barrage, Polavaram Barrage, Heavy Flood Surge, Heavy Flood Surge In AP, Heavy Flood Surge In AP News, Heavy Flood Surge In AP Latest News, Heavy Flood Surge In AP Latest Updates, Heavy Flood Surge In AP Live Updates, AP High Alert, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ లోని పోలవరం, ధవళేశ్వరం బ్యారేజ్‌ల వద్ద హై అలర్ట్‌ ప్రకటించారు. రాష్ట్రానికి ఎగువనున్న మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడంతో గోదావరి, దాని ఉప నదులు ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, కడెంవాగు ఉప్పొంగుతున్నాయి. దీంతో గోదావరి నది భారీ వరదతో ఉప్పొంగుతోంది. ముఖ్యంగా తెలంగాణలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన పార్వతి, లక్ష్మీ, సరస్వతి బ్యారేజ్‌ల వద్ద కూడా గోదావరి వరద ముంచెత్తింది. ఈ క్రమంలో అప్రమత్తమైన తెలుగు రాష్ట్రాల యంత్రాంగం శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి ధవళేశ్వరం వరకూ ఉన్న తొమ్మిది ప్రాజెక్టుల గేట్లను పూర్తిగా ఎత్తేసింది.

మరోవైపు ఆంధ్రాలోని ఉభయ గోదావరి జిల్లాలు, కాకినాడ, ఏలూరు, అల్లూరి సీతారామరాజు (ఏఎస్‌ఆర్), డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లోని 42 మండలాల్లోని 524 గ్రామాలకు గురువారం హైఅలర్ట్ ప్రకటించారు. ధవళేశ్వరం బ్యారేజ్‌ వద్ద మూడవ హెచ్చరిక సిగ్నల్ జారీ చేశారు. ధవళేశ్వరం బ్యారేజ్‌ వద్ద వరద ఉధృతి అంతకంతకూ తీవ్రమవుతోంది. దీని ప్రభావంతో ఇప్పటికే కోనసీమ 18 మండలాల్లోని 59 గ్రామాలను భారీ వరద చుట్టుముట్టింది. కొన్ని గ్రామాలకు రాకపోకలు ఆగిపోగా, మరికొన్ని గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో అధిరులు ముంపు గ్రామాల్లో సహాయక చర్యలు చేపట్టారు. 8 ఎన్డీఆర్‌ఎఫ్, 10 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దింపారు.

మరోవైపు రాజమహేంద్రవరం జిల్లాలో ఎనిమిది మండలాల్లో వరద ప్రభావం పడింది. తూర్పుగోదావరిలో 8 మండలాలపై, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 5, పశ్చిమ గోదావరిలో 4 మండలాలు, ఏలూరు 3, కాకినాడలో 2 మండలాలపై వరద ప్రభావం పడింది. కాగా ఈ సాయంత్రానికి ధవళేశ్వరం బ్యారేజ్‌ వద్దకు వరద ప్రవాహం 22 నుంచి 23 లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ వరద ప్రవాహం 22 లక్షల క్యూసెక్కులకు చేరితే 6 జిల్లాల్లోని 42 మండలాల్లో 554 గ్రామాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు కలెక్టర్లకు ఏపీ విపత్తుల నిర్వహణ అధికారులు సూచనలు చేస్తున్నారు. ఏపీ విపత్తుల శాఖ స్పెషల్ సీఎస్ సాయిప్రసాద్ కంట్రోల్ రూమ్ నుంచి వరద పరిస్థితి మరియు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + sixteen =