వైఎస్సార్‌సీపీ ‘సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర’ పోస్టర్ విడుదల చేసిన మంత్రి విడదల రజిని

AP Minister Vidadala Rajani Unveiles The YSRCP Bus Yatra Poster, Minister Vidadala Rajani Unveiles The YSRCP Bus Yatra Poster, YSRCP Bus Yatra Poster, Minister Vidadala Rajani who unveiled the posters of the samajika Bheri Yatra in the backdrop of the YSRCP bus yatra, samajika Bheri Yatra, YSRCP bus yatra, Minister Vidadala Rajani, Vidadala Rajani, Minister For Health & Family Welfare Government Of Andhrapradesh, AP Health Minister, Vidadala Rajani AP Health Minister, AP Health Minister Unveiles The YSRCP Bus Yatra Poster, AP Health Minister Vidadala Rajani Unveiles The YSRCP Bus Yatra Poster, YSRCP Bus Yatra Poster News, YSRCP Bus Yatra Poster Latest News, YSRCP Bus Yatra Poster Latest Updates, YSRCP Bus Yatra Poster Live Updates, Mango News, Mango News Telugu,

సామాజిక న్యాయభేరి పేరుతో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 26 నుంచి 29 వరకు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మంత్రులతో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 26వ తేదీన శ్రీకాకుళం పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం యాత్ర ప్రారంభమవనుంది. దీనికి సంబంధించి బస్సు యాత్ర పోస్టర్లను పార్టీ విడుదల చేసింది. ఈ క్రమంలో పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం తూబాడు గ్రామంలో పార్టీ నాయకులతో కలిసి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని బస్సు యాత్ర పోస్టర్లను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ.. ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. సామాజిక న్యాయం వర్ధిల్లుతోందని, దీనికి నిదర్శనమే ఏపీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రిజర్వేషన్‌లలో 50% కేటాయించడమని గుర్తు చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల్లో దాదాపు 75 శాతం బలహీనవర్గాలకే అందజేస్తున్నామని, 25 మంది సభ్యులున్న రాష్ట్ర కేబినెట్‌లో ఏకంగా 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలను తీసుకోవడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే సాధ్యమని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం చేపట్టిన ఈ బస్సు యాత్రను ప్రజలు జయప్రదం చేయాలని మంత్రి కోరారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 2 =