ఏపీలో మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

Andhra Pradesh panchayat elections, AP Election Commissioner Meet Governor, AP Election News, AP Elections, Ap Political News, AP Political Updates, AP Politics, AP SEC Released Election Notification, AP SEC Released Election Notification for Remained Local body Places, AP SEC Released Election Notification for Remained Local body Places in the State, Election Notification for Remained Local body Places in AP, Mango News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి ఎన్నికల సందడి మొదలవనుంది. రాష్ట్రంలో ఎన్నికలు జరగకుండా మిగిలిన స్థానిక సంస్థలకు (కార్పోరేషన్, మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ) తాజాగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని నవంబర్ 1, సోమవారం నాడు నోటిఫికేషన్ విడుదల చేశారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌ సహా 12 మున్సిపాలిటీలు (ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, దాచేపల్లి, గురజాల, దర్శి, కుప్పం, బుచ్చిరెడ్డిపాలెం, బేతంచర్ల, కమలాపురం, రాజంపేట, పెనుకొండ), గ్రేటర్‌ విశాఖపట్నం కార్పోరేషన్ లో రెండు డివిజన్లు (32,61), 6 కార్పోరేషనల్లో12 డివిజన్లకు, 12 మున్సిపాలిటీల్లో మిగిలిపోయిన 13 వార్డులకు, రాష్ట్రవ్యాప్తంగా వివిధ కారణాలతో ఆగిపోయిన 187 ఎంపీటీసీ స్థానాలకు, 16 జడ్పీటీసీ స్థానాలకు, 498 గ్రామ పంచాయతీల పరిధిలోని 69 సర్పంచ్‌ పదవులకు, 533 వార్డు మెంబర్‌ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

అన్ని స్థానాల్లో నవంబర్ 3 నుంచి 5 వరకు నామినేషన్లు స్వీకరించనుండగా, పంచాయతీల్లో 14వ తేదీన, 15న మున్సిపాలిటీలు, కార్పోరేషన్లల్లో, 16న ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో ఎన్నికలను నిర్వహించనున్నారు. అలాగే పంచాయతీల్లో 14వ తేదీనే కౌంటింగ్‌ నిర్వహించనుండగా, మున్సిపాల్టీలు, కార్పోరేషన్లలో 17న, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో 18న కౌంటింగ్‌ ప్రక్రియ జరగనుంది. మరోవైపు ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో సోమవారం నుంచే ఎన్నికల కోడ్‌ అమలులోకి రానునట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 1 =