కాంగ్రెస్‌ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికీ రూ.2లక్షల బీమా సౌకర్యం: రేవంత్ రెడ్డి

Congress Digital Membership, Congress Digital Membership Drive, Congress Digital Membership Drive News, Congress Digital Membership Drive Started, Congress Digital Membership Drive Started Today, Congress Digital Membership Drive Started Today at Gandhi Bhavan, Congress Digital Membership Drive Updates, Congress launch membership drive, Congress Party Digital Membership Drive, Congress undertake mass membership drive, Feroz Khan, Feroz Khan at Launching Program of #Congress Party Digital Membership, Indian National Congress, Launching Program of Congress Party Digital Membership Drive, Mango News, TPCC Chief Revanth

దేశవ్యాప్తంగా నవంబర్ 1, 2021 నుండి మార్చి 31, 2022 వరకు భారీగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్టీ నాయకులకు, పీసీసీ అధ్యక్షులకు, ఇంఛార్జిలకు, జనరల్ సెక్రరేటరీలకు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం గాంధీ భవన్ లో జరిగిన కాంగ్రెస్‌ డిజిటల్‌ సభ్యత్వ నమోదు ప్రారంభ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణికం ఠాగూర్‌, సీనియర్‌ నేతలు వీహెఛ్ హనుమంతురావు, గీతారెడ్డి, మధుయాష్కీ గౌడ్, దామోదర్ రాజనర్సింహ, షబ్బీర్‌ అలీ, ఎమ్మెల్యే సీతక్క సహా పలువురు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు హాజరై తమ సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నారు.

ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమంలో భాగంగా 30 లక్షలకు పైగా సభ్యత్వాలు చేపట్టాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతుందని, అందుకోసం శ్రమిస్తున్న రాహుల్‌గాంధీకి మద్దతుగా నిలవాలని కోరారు. అలాగే కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికీ రూ.2లక్షల బీమా సౌకర్యం కల్పించనున్నట్లుగా రేవంత్ రెడ్డి తెలిపారు. మరోవైపు నవంబర్ 14వ తేదీ నుంచి నవంబర్ 21 వరకు గ్రామాల్లో ‘కాంగ్రెస్‌ జన జాగరణ’ యాత్రలు చేపట్టనున్నట్టు ప్రకటించారు. ఇక డిసెంబర్‌ 9న నగరంలోని పెరేడ్‌ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నామని, ఆ సభకు రాహుల్‌గాంధీ హాజరు అవుతారని చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − five =