వైఎస్‌ విజయమ్మకు తృటిలో తప్పిన ప్రమాదం, పేలిన ప్రయాణిస్తున్న కారు టైర్లు

AP YS Vijayamma Narrow Escapes in Car Accident at Gooty Town Anantapur Today, YS Vijayamma Narrow Escapes in Car Accident at Gooty Town Anantapur Today, YS Vijayamma Narrow Escapes in Car Accident, Car Accident, Gooty Town Anantapur, YS Vijayamma, YS Vijayamma escapes a major accident, YS Vijayamma News, YS Vijayamma Latest News, YS Vijayamma Latest Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. గురువారం ఆమె ప్రయాణిస్తున్న కారు టైర్లు పేలడంతో ప్రమాదం జరిగింది. అయితే ఈ ఘటనలో విజయమ్మకు ఎలాంటి ప్రమాదం కలగలేదు, దీని నుంచి ఆమె సురక్షితంగా బయటపడ్డారు. కాగా కారు రెండు టైర్లు ఒకేసారి పేలడంతో కారు అదుపుతప్పిందని, అయితే డ్రైవర్‌ చాకచక్యంతో కారుని అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం నుంచి విజయమ్మ బయటపడినట్లుగా తెలుస్తోంది. కాగా ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, విజయమ్మ క్షేమంగా ఉందన్న వార్త తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి స్నేహితుడు అయ్పపురెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్ విజయమ్మ కర్నూలుకు వచ్చారు. అనంతరం తిరిగి వెళ్తుండగా గుత్తి పెట్రోల్‌ బంక్‌ సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు రెండు టైర్లు ఒకేసారి పేలిపోయాయి. దీంతో నియంత్రణ కోల్పోయిన కారు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకు పోయింది. అయితే డ్రైవర్‌ వెంటనే అప్రమత్తమై కారును అదుపు చేయడంతో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ లోపు తమ అనుచరులకు విషయం తెలియడంతో మరో కారు ఏర్పాటు చేయగా, ఘటన అనంతరం వైఎస్ విజయమ్మ అక్కడి నుంచి మరో కారులో హైదరాబాద్‌ వెళ్లిపోయారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here