వైద్య ఆరోగ్య సిబ్బందికి తగిన రక్షణ, భరోసా ఇవ్వాలి – పవన్‌ కళ్యాణ్

Andhra Pradesh, AP Corona Cases, AP Corona Positive Cases, AP Coronavirus, AP COVID 19 Cases, AP Total Positive Cases, Corona Positive Cases, Coronavirus, COVID-19, Janasena Pawan Kalyan, pawan kalyan, Pawan Kalyan Asks To Provide Adequate Care Medical Staff

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆరోగ్యవంతమైన సమాజం కోసం వైద్యులు, ఇతర ఆరోగ్య సిబ్బంది ఎంతగానో శ్రమిస్తున్నారని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా తమ ప్రాణాలను సైతం ప్రాణంగా పెట్టి కరోనా బాధితులకు సేవలందిస్తున్న వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, ఇతర సిబ్బందికి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. వైద్యో నారాయణ హరి అంటూ వైద్యులను భగవంతుడితో సమానంగా చూసే సంస్కృతి మనదని ఆయన పేర్కొన్నారు.

మానవతామూర్తులైన ఎందరో వైద్యులు తమ వృత్తి ధర్మంతో పేదలకు ఎనలేని సేవలు చేస్తున్నారు. ప్రజా వైద్యులుగా గౌరవాన్ని పొందుతున్నారు. వారి ఇస్తున్న స్ప్రూర్తి నేడు వైద్య ఆరోగ్య సిబ్బందిలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. తమకీ, తమ కుటుంబానికీ వైరస్ ముప్పు ఉంటుందని తెలిసీ రోగులకు సేవలు చేస్తున్నవారిని ఎప్పటికీ మరచిపోకూడదు. విధి నిర్వహణలో ఉన్న వైద్యులకు, పారా మెడికల్ సిబ్బందికి ప్రభుత్వం తగిన రక్షణ, భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే కోవిడ్-19 విధుల్లో ఉన్నవారందరికీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచించిన విధంగా ప్రభుత్వాలు పీపీఈలు సమకూర్చాలని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. ఈ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య దినోత్సవానికి సపోర్ట్ నర్సెస్ అండ్ మిడ్-వైప్స్ అనే
నినాదాన్ని తీసుకున్నందున రోగుల సేవలో ఉన్న నర్సులు, ప్రసూతి ఆయాల ఆర్థిక పరిస్థితి మెరుగు పరచడంతో పాటు ఉద్యోగ భద్రతకు తగిన చట్టాలు తీసుకురావాలని పవన్‌ కళ్యాణ్ కోరారు.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 12 =