ఏపీ ఆర్టీసీ బస్సుల్లో ఇకపై పూర్తి సీట్ల సామర్థ్యం మేరకు ప్రయాణికులకు అనుమతి

Andhra Pradesh, Andhra Pradesh State Road Transport Corporation, AP News, APSRTC, APSRTC BUS Services, APSRTC bus services to get tech loaded, APSRTC has Decided to Allow Passengers, APSRTC mulls 26-seater buses, APSRTC News, APSRTC Updates

కరోనా లాక్‌డౌన్ లో కేంద్రప్రభుత్వం సడలింపులు ఇచ్చాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత మే 21 నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులు రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే కరోనా నిబంధనలకు అనుగుణంగా ఇప్పటివరకు సగం సీట్లలో మాత్రమే ప్రయాణికులకు అనుమతిచ్చారు. ఆన్‌లైన్‌లో టికెట్ బుకింగ్ సిస్టంలో కూడా సగం సీట్లే అందుబాటులో ఉండేలా మార్పులు చేశారు. కాగా తాజా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇకపై బస్సుల్లో పూర్తిస్థాయి సామర్థ్యంతో ప్రయాణికులకు సీట్లు కేటాయించాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు.

ఈ మేరకు అన్ని డిపోలకు ఆర్టీసీ అధికారులు మంగళవారం నాడు ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆన్‌లైన్‌ బుకింగ్ లో కూడా ప్రయాణానికి అన్ని సీట్లు అందుబాటులోకి వచ్చేలా మళ్ళీ సాఫ్ట్ వేర్ లో మార్పులు చేయనున్నారు. కరోనా పరిస్థితులు కొంచెం తగ్గుముఖం పడుతూ, అన్ని కార్యకలాపాలు పూర్తిస్థాయిలో తిరిగి ప్రారంభమవుతుండంతో, ఆర్టీసీపై కూడా భారం పడకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 11 =