చంద్రబాబు క్వాష్ పిటిషన్.. సుప్రీం కీలక తీర్పు

Chandrababu Quash Petition Supreme Key Verdict,Chandrababu Quash Petition,Supreme Key Verdict,Chandrababu naidu, Skill development scam case, Supreme court,Mango News,Mango News Telugu,Justice Aniruddha Bose,Special Leave Petition,No relief for Chandrababu Naidu,SC delivers split verdict,Chandrababu Skill Case Latest News,Chandrababu Skill Case Live Updates,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates
Chandrababu naidu, Skill development scam case, Supreme court

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కొద్దిరోజుల క్రితం ఏపీ సీఐడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు 50 రోజులకు పైగా జైలు జీవితం గడిపారు. అయితే గవర్నర్ అనుమతి తీసుకోకుండానే ఏపీ సీఐడీ తనపై కేసు నమోదు చేసిందని చంద్రబాబు గతంలో ఆరోపించారు. ఈ మేరకు తనపై నమోదు చేసిన స్కిల్ డెవలప్‌మెంట్ కేసును కొట్టివేయాలని సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.

జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. సుదీర్ఘ విచారణ అనంతరం మంగళవారం తీర్పు వెలువరించింది. అయితే న్యాయమూర్తులు ఇద్దరూ వేర్వేరుగా తీర్పు వెలువరించారు. చంద్రబాబు కేసులో తగిన అనుమతులు తీసుకోకుండానే సీఐడీ అధికారులు ముందుకు వెళ్లారని.. కేసుల నమోదుకు ముందు సీఐడీ అనుమతి తీసుకోవాల్సి ఉండేదని జస్టిస్ అనిరుద్ధబోస్ అభిప్రాయపడ్డారు. సెక్షన్ 17-ఏ కింద ముందస్తు అనుమతులు తప్పనిసరి అని.. అనుమతి తీసుకోకపోతే అది చట్టవిరుద్ధమని వ్యాఖ్యానించారు.

అయితే అనిరుద్ధబోస్ తీర్పుకు వ్యతిరేకంగా బెలా ఎం. త్రివేది తీర్పు వెలువరించారు. 2018 చట్ట సవరణ కంటే ముందు జరిగిన నేరాలకు సెక్షన్ 17-ఏ వర్తించదని త్రివేది స్పష్టం చేశారు. నిజాయతీ గత పబ్లిక్ సర్వెంట్స్‌కు ఇబ్బంది కలకూడదనే ఉద్దేశంతో చట్టసవరణ చేశారని వ్యాఖ్యానించారు. అయితే ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరుగా తీర్పు వెలువరించడంతో.. ఈ పిటిషన్‌ను సీజేఐకి నివేదిస్తున్నట్లు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ నిరుద్ధబోస్ వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + four =