ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం.. బీఏసీ సభ్యులుగా మంత్రులు పెద్దిరెడ్డి, జోగి రమేశ్‌ నియామకం

CM Jagan Appoints Ministers Peddireddy and Jogi Ramesh as BAC Members Ahead of Assembly Meetings, Ys Jagan Appoints BAC Members, Jagan Appointed Peddireddy As BAC Member, AP CM Appointed Jogi Ramesh as BAC Member, AP CM YS Jagan Mohan Reddy BAC Meeting, Mango News, Mango News Telugu, BAC Meeting, New BAC Members Peddireddy and Jogi Ramesh, Minister Peddireddy , Minister Jogi Ramesh, AP CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan Latest News And Updates

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు ముందు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఇటీవల మంత్రిగా ప్రమోషన్ అందుకున్న జోగి రమేష్‌లను శాసనసభ బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సభ్యులుగా నియమిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. వీరు గత మంత్రివర్గంలో పనిచేసిన కన్నబాబు, అనిల్‌ కుమార్ యాదవ్‌ల స్థానంలో బీఏసీ సభ్యులుగా నియమితులవడం గమనార్హం. అలాగే గండికోట శ్రీకాంత్ రెడ్డిని శాసనసభ వ్యవహారాల సమన్వయకర్తగా నియమించారు. కాగా ఈ నెల 15 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

ఈ మేరకు సెప్టెంబర్ 15 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవనున్నాయని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఇప్పటికే నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. 15వ తేదీ ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసన మండలి సమావేశమవనున్నాయి. ఈ క్రమంలో ఈ సమావేశాలలో ప్రవేశపెట్టనున్న బిల్లులకు సంబంధించిన సమగ్ర వివరాలను ఈ నెల 12వ తేదీలోగా ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపాలని సీఎంవో ప్రత్యేక కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు సంబంధిత ప్రభుత్వ శాఖలకు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఈ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనేది అసెంబ్లీ బీఏసీ సమావేశంలో నిర్ణయించనున్నారు. కాగా అసెంబ్లీ గత సమావేశాలు జూలై 19 నుంచి ఐదు రోజుల పాటు జరిగింది. ఈ నేపథ్యంలో.. సీఎం జగన్ ఈ కీలక నిర్ణయం తీసుకోవడం సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + eleven =