గుంటూరులో ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు, నటుడు అలీ కుమార్తె వివాహ రిసెప్షన్‌, హాజరైన సీఎం జగన్‌

CM Jagan Attends For The AP Govt Electronic Media Advisor Actor Ali's Daughter Marriage Reception at Guntur Today,AP Govt Electronic Media Advisor,CM Jagan Attends Ali's Daughter Marriage Reception,AP Electronic Media Advisor Ali,Actor Ali's Daughter Marriage Reception,Mango News,Mango News Telugu,Tdp Chief Chandrababu Naidu,AP CM YS Jagan Mohan Reddy , YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు, నటుడు అలీ కుమార్తె వివాహ రిసెప్షన్‌ ఘనంగా జరిగింది. మంగళవారం గుంటూరు పట్టణం ఇన్నర్ రింగ్ రోడ్డులోని శ్రీ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. అలీ తన భార్యతో కలిసి ముఖ్యమంత్రికి ఎదురేగి స్వాగతం పలికి వేదిక వద్దకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా నూతన వధూవరులకు ఆయన పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వధూవరులిద్దరినీ సీఎం జగన్ ఆశీర్వదించారు. కాగా ఇటీవలే నటుడు అలీని ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా సీఎం జగన్ నియమించడం తెలిసిందే. ఇక కొద్దీ రోజుల ముందే అలీ, కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రిని కలిసి కుమార్తె వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించడం తెలిసిందే. ఇక ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here