ఏపీ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఆధిపత్యం.. రెండు స్థానాలు కైవసం, మూడో స్థానంలో హోరాహోరీ

AP MLC Elections Results TDP Wins Two Graduate Seats in North Andhra and East Rayalaseema,AP MLC Elections Results,TDP Wins Two Graduate Seats,TDP Wins in North Andhra,TDP Wins Two Graduate Seats in East Rayalaseema,Mango News,Mango News Telugu,TDP wins North Andhra Graduates,TDP Set To Taste Victory in Andhra Pradesh,AP MLC Elections Latest News,AP MLC Elections Latest Updates,AP MLC election results 2023,AP MLC Election Result 2023 Winners List,MLC Polls 2023,AP TDP MLC Elections Live News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 108 నియోజకవర్గాల పరిధిలో విస్తరించిన మూడు గ్రాడ్యుయేట్‌ (పట్టభద్రుల) ఎమ్మెల్సీ స్థానాల్లో ప్రతిపక్ష తెలుగుదేశం (టీడీపీ) ఆధిపత్యం చూపించింది. మొత్తం మూడు స్థానాలకు ఎన్నికలు జరుగగా.. రెండింటిని కైవసం చేసుకుంది. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ నియోజకవర్గాల్లో విజయ బావుటా ఎగరేసింది. ఈ రెండు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఇరువురు తొలి ప్రాధాన్య ఓట్లలో టీడీపీ అభ్యర్థులు భారీ ఆధిక్యం సాధించారు. ఉత్తరాంధ్ర టీడీపీ అభ్యర్థి చిరంజీవి రావు, తూర్పు రాయలసీమ అభ్యర్థి శ్రీకాంత్ భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇక మూడో స్థానమైన పశ్చిమ రాయలసీమలో అధికార వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య స్వల్ప ఓట్ల తేడా ఉండటంతో.. ఇక్కడ రెండో ప్రాధాన్యతా ఓట్లు కీలకం కానున్నాయి. అయితే ఈ స్థానంలో కూడా విజయం సాధిస్తామని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఫలితాలపై టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here