రేపు గుంటూరు జిల్లాలో ‘వైఎస్సార్ యంత్ర సేవ’ పథకం మెగా మేళా ప్రారంభించనున్న సీఎం జగన్‌

AP CM YS Jagan Mohan Reddy To Start YSR Yantra Seva Scheme Mega Mela in Guntur District Tomorrow, CM Jagan To Start YSR Yantra Seva Scheme Mega Mela in Guntur District Tomorrow, AP CM To Start YSR Yantra Seva Scheme Mega Mela in Guntur District Tomorrow, AP CM Jagan To Start YSR Yantra Seva Scheme Mega Mela in Guntur District Tomorrow, AP CM YS Jagan To Start YSR Yantra Seva Scheme Mega Mela in Guntur District Tomorrow, YSR Yantra Seva Scheme Mega Mela in Guntur District Tomorrow, YSR Yantra Seva Scheme Mega Mela, Guntur District, YSR Yantra Seva Scheme, YSR Yantra Seva Scheme News, YSR Yantra Seva Scheme Latest News, YSR Yantra Seva Scheme Latest Updates, YSR Yantra Seva Scheme Live Updates, AP CM YS Jagan Mohan Reddy, CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, Jagan Mohan Reddy, YS Jagan, CM Jagan, CM YS Jagan, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రేపు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. మంగళవారం ‘వైఎస్సార్ యంత్ర సేవ’ పథకం మెగా మేళా నిర్వహించనున్నారు. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లు వంటి యంత్రాలు పంపిణీ చేయనున్నారు. దీనిలో భాగంగా 3,800 ట్రాక్టర్లు, 320 కంబైన్డ్ హార్వెస్టర్లను రైతులకు అందించనున్నారు. అలాగే 5,262 రైతు గ్రూపులకు చెందిన బ్యాంక్ ఖాతాలలో రూ. 175.61 కోట్ల సబ్సిడీ మొత్తాన్ని జమ చేయనున్నారు. అలాగే పల్నాడు జిల్లా కొండవీడులో జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అనంతరం చుట్టుగుంట సెంటర్‌లో సీఎం జగన్ బహిరంగ సభ నిర్వహించనున్నారు.

కాగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ పర్యటన నేపథ్యంలో గుంటూరు, పల్నాడు జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కమిషనరేట్‌లో వైఎస్‌ఆర్‌ యంత్ర సేవా పథకం కింద ట్రాక్టర్లు, హార్వెస్టర్ల పంపిణీ ఏర్పాట్లను గుంటూరు, పల్నాడు జిల్లాల కలెక్టర్లు ఎం.వేణుగోపాల్‌ రెడ్డి, శివశంకర్, పోలీస్ సూపరింటెండెంట్ రవిశంకర్ రెడ్డి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ తదితరులు సమీక్ష నిర్వహించారు. ఇక వైసీపీ ఎమ్మెల్సీలు తలసిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, మేయర్‌ కావటి శివనాగ మనోహర్‌ నాయుడు తదితరులు సీఎం పాల్గొననున్న బహిరంగ సభ ప్రాంతాన్ని పరిశీలించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + 19 =