మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి, పలు అభివృద్ధి పనులకు శకుస్థాపన

Minister Errabelli Participates Pattana Pragati Program in Medchal-Malkajgiri District Today, Errabelli Participates Pattana Pragati Program in Medchal-Malkajgiri District Today, Telangana Minister Errabelli Participates Pattana Pragati Program in Medchal-Malkajgiri District Today, Pattana Pragati Program in Medchal-Malkajgiri District Today, Pattana Pragati Program in Malkajgiri District Today, Pattana Pragati Program in Medchal District Today, Pattana Pragati Program, Minister Errabelli, Telangana Minister Errabelli, Medchal-Malkajgiri District, Pattana Pragati Program News, Pattana Pragati Program Latest News, Pattana Pragati Program Latest Updates, Pattana Pragati Program Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 5వ విడత పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలలో అధికార పార్టీకి చెందిన పలువురు మంత్రులు, నాయకులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. దీనిలో భాగంగా హైదరాబాద్ పరిధిలోని మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు సోమవారం పర్యటించారు. ఈ క్రమంలో మంత్రి మాల్లారెడ్డితో కలిసి జిల్లాలోని మూడు చింతలపల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. రూ. 15 లక్షల ఎస్‌డీఎఫ్ నిధులతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం, మరో 15 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్డు నిర్మాణం పనులను ప్రారంభించారు. అలాగే 13.5 లక్షలతో మండల ప్రజా పరిషత్ కార్యాలయం ప్రహరీ గోడ నిర్మాణానికి మంత్రి శకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు మాట్లాడుతూ.. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే మన ప్రజల బ్రతుకులు బాగుపడ్డాయని, దీనికి కారణం ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని పేర్కొన్నారు. ఈ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామ పంచాయతీలకు సీఎం కేసీఆర్‌ రూ. 230 కోట్లు కేటాయిస్తున్నారని, దీని ద్వారా ప్రతి గ్రామానికి పుష్కలంగా నిధులు అందుతున్నాయని తెలిపారు. తద్వారా ప్రతి గ్రామంలో ఇంటింటికీ నీళ్లు, ట్యాంకర్లు, నర్సరీలు, డంపింగ్ యార్డుతో పాటు వైకుంఠ ధామాలు వంటివి ఏర్పాటు చేసుకుంటున్నామని వెల్లడించారు.

తెలంగాణలోని అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు ప్రజలతో పాటు పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల వలన ప్రజలకు మేలు కన్నా చెడే ఎక్కువ జరిగిందని, వాళ్ల వల్లే దేశంలో పెట్రోలో, డీజిల్, నిత్యావసర ధరలు పెరిగాయని మండిపడ్డారు. ఈ రెండు పార్టీల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రా రెడ్డి, పలువురు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + 18 =