కాశీ వీధుల నుండి దశాశ్వమేధ ఘాట్ వరకు… మనోజ్ఞ సూర్యదేవర వారణాసి ట్రావెల్ డైరీస్

Varanasi Travel Diaries Manogna Explores Kashi's Ghats and Vibrant Culture

Telugu Vlogger Manogna Suryadevara తన తాజా వ్లాగ్‌లో పూణే నుండి ఆధ్యాత్మిక నగరం వారణాసి (కాశీ) కి వెళ్లిన విశేషాలను ప్రేక్షకాలతో పంచుకున్నారు. పూణే నుండి కొత్తగా నిర్మించిన నవీ ముంబై ఎయిర్‌పోర్ట్ మీదుగా కాశీ చేరుకున్న ఆమె, అక్కడి ఇరుకు వీధులు మరియు వాతావరణ అనుభవాలను వివరించారు.

కాశీలో అడుగుపెట్టిన తొలిరోజే ప్రసిద్ధ దశాశ్వమేధ ఘాట్‌ను సందర్శించిన మనోజ్ఞ, సాయంత్రం వేళ ఘనంగా జరిగే గంగా హారతిని తిలకించారు. తీవ్రమైన ఎండ, భక్తుల రద్దీ ఉన్నప్పటికీ… గంటల మోతలు, వైబ్రేషన్స్ మధ్య గంగా హారతిని చూడటం ఒక భిన్నమైన ఆధ్యాత్మిక అనుభూతిని ఇచ్చిందని ఆమె పేర్కొన్నారు. కాశీకి వచ్చే పర్యాటకులకు ఉపయోగపడే పలు కీలక సూచనలు, చిట్కాలను కూడా ఈ వ్లాగ్‌ ద్వారా అందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here