సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లకు చప్పట్లు కొట్టి అభినందనలు తెలిపిన సీఎం జగన్‌

CM YS Jagan Appreciates Village, Ward Secretariat Employees and Volunteers with Claps

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థను అమల్లోకి తెచ్చి నేటితో ఏడాది పూర్తయిన సందర్భంగా సిబ్బంది సేవలను గుర్తిస్తూ, వారిని ప్రోత్సహించేలా ప్రజలంతా ఈ రోజు సాయంత్రం 7 గంటలకు ఇంటి నుంచి బయటకు వచ్చి చప్పట్లతో అభినందించాలని సీఎం వైఎస్ జగన్‌ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా తాడేపల్లిలోని తన నివాసంలో శుక్రవారం రాత్రి 7 గంటలకు సీఎం వైఎస్ జగన్ చప్పట్లు కొట్టి సచివాలయాల ఉద్యోగులు, గ్రామ, వార్డు వాలంటీర్లకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, డీజీపీ గౌతమ్ సవాంగ్‌ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొని చప్పట్లు కొట్టారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వైసీపీ నాయకులు ప్రజలుతో కలిసి ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొని చప్పట్లు కొడుతూ గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లకు అభినందనలు తెలియజేశారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 5 =