పలువురు కేంద్రమంత్రులతో సీఎం వైఎస్ జగన్ భేటీ, ముగిసిన ఢిల్లీ పర్యటన

CM YS Jagan Meets Several Central Ministers at Delhi, Ends his Tour Today

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ ఢిల్లీ పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో భాగంగా గురువారం నాడు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌‌, కేంద్ర సమాచార శాఖ ప్రకాష్ జవదేకర్‌, నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్‌ కుమార్‌లతో సీఎం వైఎస్ జగన్ భేటీ అవగా, శుక్రవారం ఉదయం కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌, కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తో భేటీ అయి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనను ముగించుకుని శుక్రవారం మధ్యాహ్నం సీఎం వైఎస్ జగన్ తిరిగి ఏపీకి బయలుదేరారు.

మరోవైపు కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తో భేటీ సందర్భంగా విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపై పున‌రాలోచ‌న చేసి, సానుకూల నిర్ణ‌యం ప్ర‌క‌టించాల‌ని సీఎం వైఎస్ జ‌గ‌న్ విజ్ఞ‌ప్తి చేశారు. ఢిల్లీలోని మంత్రి నివాసంలో క‌లిసి గంట‌కుపైగా ఏపీకి సంబంధించిన ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. ఏపీలో ఖ‌చ్చితంగా పెట్రో కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేస్తామ‌ని ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్ర‌ధాన్ హామీ ఇచ్చినట్టు తెలిపారు. అలాగే వయబిలిటీ గ్యాప్‌ ఫండ్‌ విషయంలోనూ సానుకూలంగా స్పందించారని, వచ్చేవారం ఏపీ సీఎస్‌, పెట్రోలియం శాఖలోని కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేస్తామని సీఎంకు హ‌మీ ఇచ్చినట్టు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + 7 =