వచ్చే జనవరి నుంచి పెన్షన్ ను రూ.3000కు పెంచుతాం, సీఎం వైఎస్ జగన్ కీలక ప్రకటన

CM YS Jagan Speech in Assembly: Announces Pension to be Increased to Rs 3000 from Next January Month,CM YS Jagan Speech in Assembly,CM YS Jagan Announces Pension to be Increased,Pension to be Increased to Rs 3000 from Next January Month,CM YS Jagan Speech,Mango News,Mango News Telugu,CM Ys Jagan Statement about 3000 Pension Hike,CM YS Jagan Speech in AP Budget Assembly Session,AP Budget Assembly Session,AP Assembly Sessions 2023,AP Budget Sessions Latest News,AP CM YS Jagan Budget Session Live News

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం శాసనసభలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఏపీలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక లబ్ధిదారులకు సీఎం వైఎస్ జగన్ గుడ్ న్యూస్ అందించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకు రూ.2750 చొప్పున పెన్షన్ అందిస్తుండగా, వచ్చే జనవరి నుంచి పెన్షన్ ను రూ.3000కు పెంచుతామని ప్రకటించారు.

సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, “గత ప్రభుత్వం ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు అందించిన పెన్షన్‌ కేవలం 1000. అది కూడా కేవలం 39 లక్షల మందికే ఇచ్చారు. ప్రస్తుతం ఈ ప్రభుత్వంలో దేవుడి దయతో గ్రామస్థాయిలో ఏకంగా 64 లక్షల మంది పెన్షన్‌ అందుకుంటున్నవారు ఉన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే పెన్షన్‌ను రూ.2250కి పెంచి, ఇప్పటికే రూ.2750 వరకు తీసుకెళ్లాం. రేపు బడ్జెట్‌ కూడా ప్రవేశపెట్టబోతున్నాం. ఆ బడ్జెట్‌ లో జనవరి వచ్చేసరికి పెన్షన్‌ రూ.2750 నుంచి రూ.3 వేలకు కూడా తీసుకెళ్తాం. ఆ తరువాతే ఎన్నికలకు వెళ్లే కార్యక్రమం జరుగుతుందని చెప్పడానికి గర్వపడుతున్నాను” అని పేర్కొన్నారు.

గత ప్రభుత్వాలు గాల్లో మాటలు, గ్రాఫిక్స్, అదిగో మైక్రోసాఫ్ట్, అదిగో బుల్లెట్ రైలు అనే మాటలు మాట్లాడేవారని సీఎం జగన్ అన్నారు. కానీ “నా నడక మాత్రం నేల మీదే. నా ప్రయాణం సామాన్యులతోనే. నా ప్రయాణం పేదవర్గాలతోనే. నా యుద్ధం పెత్తందార్లతోనే. నా లక్ష్యం పేదరిక నిర్మూలనే. కాబట్టే నా ఎకనామిక్స్‌ వేరే” అని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 1 =