ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్టోబర్ 16, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,75,470 కు, మరణాల సంఖ్య 6382 కు చేరుకుంది. గత 24 గంటల్లో (9AM-9AM) 74,337 కరోనా పరీక్షలు నిర్వహించగా 3967 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో కరోనా వలన మరో 25 మంది మరణించారు.
రాష్ట్రంలో కరోనా వలన చిత్తూరులో ఐదుగురు, కడపలో నలుగురు, కృష్ణాలో నలుగురు, గుంటూరులో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గురు, తూర్పుగోదావరిలో ఇద్దరు, నెల్లూరులో ఒకరు, శ్రీకాకుళంలో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు, పశ్చిమగోదావరిలో ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 6382 కి చేరింది. ఇక నమోదైన మొత్తం కేసుల్లో 7,30,109 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడగా, గత 24 గంటల్లోనే 5010 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో మరియు కోవిడ్ కేర్ సెంటర్స్ లో మొత్తం 38979 మంది చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu