56 బీసీ కార్పోరేషన్లు, అక్టోబర్ 18 న ఛైర్మన్లు, డైరెక్టర్లు నియామకం

56 Backward Classes corporation boards, 56 BC corporations to be set up in Andhra Pradesh, Andhra Pradesh Govt, AP Government, AP Govt Established 56 New BC Corporations, AP New BC Corporations, APMBC CORPORATION BACKWARD CLASSES WELFARE, Establishment of 56 New BC Corporations, Establishment of 56 New BC Corporations In AP

ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ ‌జగన్‌ మోహన్ ‌రెడ్డి రాష్ట్రంలో బీసీల సంక్షేమం కొరకు బీసీ కార్పోరేషన్లు ఏర్పాటుకు కీలక నిర్ణయం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్తగా 56 బీసీ కార్పోరేషన్లును ఏర్పాటు చేస్తూ ఏపీ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. 139 బీసీ కులాలకు ప్రాతినిధ్యం వహించేలా, జనాభా ప్రాతిపదికన 56 బీసీ కార్పోరేషన్లు ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. వెనుకబడిన కులాలకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వేగంగా అందేందుకు ఈ కార్పోరేషన్లు సహకరించనున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

పది లక్షలకు పైన జనాభా ఉండే కులాలకు సంబంధించిన కార్పోరేషన్లను ఏ కేటగిరీ గానూ, లక్ష నుంచి పది లక్షల వరకు జనాభా కార్పోరేషన్లను బి కేటగిరీ కింద, అలాగే లక్షలోపు జనాభా ఉన్న కార్పోరేషన్లను సి కేటగిరీ కింద విభజించినట్టు పేర్కొన్నారు. ఇక ప్రతి కార్పోరేషన్ ‌లోనూ 13 మంది డైరెక్టర్లను నియమించనున్నారు. జిల్లాల వారీగా డైరెక్టర్లకు ప్రాతినిధ్యం కల్పించనున్నారు. అక్టోబర్ 18 వ తేదీన 56 బీసీ కార్పోరేషన్లకు ఛైర్మన్లను, డైరెక్టర్లను నియమించనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − three =