వర్మతో కలిసి జనసేనాని ఉగాది వేడుకలు

Janasenani Ugadi Celebrations With Varma, Ugadi Celebrations With Varma, Ugadi Celebrations, Janasenani Ugadi Celebrations, Pawan Kalyan, Janasena Party, TDP, BJP, Pithapuram, Janasenani Ugadi Celebrations,Varma, Andhra Pradesh Elections, AP Political News, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
Pawan Kalyan, Janasena Party, TDP, BJP, Pithapuram, Janasenani Ugadi celebrations,Varma

జనసేన అధినేత పవన్ కళ్యాణ్  పిఠాపురం నియోజకవర్గంలో కొత్త ఇంట్లో ఉగాది వేడుకలను జరుపుకున్నారు. ముందుగా అనుకున్న విధంగా  ఉగాది వేళ..జనసేన అధినేత పవన్  కళ్యాణ్ కొత్త ఇంట్లో అడుగుపెట్టారు. అలాగే పవన్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు.

పవన్ గృహపవేశ కార్యక్రమానికి తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత వర్మతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీలోని  నేతలు హాజరయ్యారు. ముందుగా ఉగాది వేడుకల్లో పాల్గొని పండితుల ఆశీస్సులు తీసుకున్న పవన్.. ఆ తర్వాత తాను తీసుకున్న కొత్త ఇంట్లోకి ప్రవేశించారు.

పంచాంగ శ్రవణం తర్వాత మాట్లాడిన పవన్ కళ్యాణ్.. రైతు క్షేమంగా ఉండాలని అన్నారు. అలాగే యూత్ కు ఉపాధి అవకాశాలు రావాలని.. మహిళలంతా నిర్భయంగా తిరగగలిగే ధైర్యం కావాలని జనసేనాని చెప్పారు. అంతేకాకుండా ఏపీలోని ఉద్యోగులకు సకాలంలో జీతాలు రావాలని..తెలుగు రాష్ట్రాలలోని ప్రజలంతా  ఆనందంగా ఉండాలని పవన్ కళ్యాణ్ కోరుకున్నారు. క్రోధినామ సంవత్సరంలో ప్రజలందరికీ శుభాలు కలగాలని కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారు.

స్ధానికంగా ఉంటున్న ఓడూరి నాగేశ్వరరావు కుటుంబం రెండేళ్ల క్రితమే తనను పిఠాపురంలో పోటీ చేయాలని కోరిందని పవన్ కళ్యాణ్ ఆ రోజుల్ని గుర్తు చేసుకున్నారు. కానీ అప్పట్లో ఆ విషయాన్ని ఆలోచించలేదని చెప్పుకొచ్చారు.  అయితే ఆ తర్వాత తనను  చాలామంది ఆహ్వానిస్తుంటే పోటీ చేయడానికి నిర్ణయం తీసుకున్నానని అన్నారు.

క్రోధినామ సంవత్సరంలో  టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ  కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు ధీమాను వ్యక్తం చేశారు. తాము ఈ ఎన్నికలలో విజయకేతనం ఎగురవేస్తున్నామని.. అది పిఠాపురం నుంచే మొదలుపెడుతున్నామని పవన్ జనసేనలో జోష్ ను నింపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 4 =