వ్యూహాలకు పదునుపెడుతున్న వైసీపీ అధినేత

YCP Chief Sharpening Strategies, Sharpening Strategies, YCP Strategies, CM Jagan Strategies, YCP Chief CM Jagan, Strategies, AP Elections, YSRCP, YCP News, YCP Political News, Andhra Pradesh Elections, AP Political News, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
YCP chief CM Jagan, strategies , AP elections , YSRCP

కూటమి వైపే ఏపీ గాలి వీస్తోందన్న ప్రచారం, వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ లాంటి వ్యక్తుల పరిశీలన, సర్వే ఫలితాల నేపథ్యంలో  ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పంథా మార్చుతున్నారు. ప్రజలతో ముఖాముఖి,  వర్గాలవారీగా ఆత్మీయ సమావేశాలు, లబ్ధిదారులతో భేటీలు సాగిస్తున్నారు. ఐదేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విప్లవాత్మకమైన పథకాలను వారికి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. మండువేసవిలోనూ విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలను ఆకట్టుకునేలా వ్యూహాలు రచిస్తున్నారు. సిద్ధం సభల తర్వాత ఓదఫా రాష్ట్రాన్ని చుట్టేసిన జగన్‌.. మేమంతా సిద్ధం ఇప్పటికే బస్సుయాత్ర కొనసాగిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలతో నేరుగా భేటీ అవుతున్నారు.

సభలు, సమావేశాల్లో ప్రసంగించడమే కాకుండా ముఖాముఖి భేటీల ద్వారా తాను చేసిన పనులను చెప్పుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనిలో భాగంగా లారీడ్రైవర్లు, పింఛనుదారులు, విద్యార్థులు.. ఇలా వర్గాల వారీగా కలుసుకునేలా ప్రణాళికలు రచించారు. ప్రకాశం జిల్లా వెంకటాచలంపల్లిలో చేపట్టిన బస్సు యాత్ర సందర్భంగా సీఎం జగన్‌ పెన్షనర్లతో ముఖాముఖి మాట్లాడారు. పెన్షన్‌ లబ్ధిదారులను ముఖ్యమంత్రి ఆప్యాయంగా పలకరించారు. అనంతరం సీఎం జగన్‌ మాట్లాడారు. ప్రతీ అవ్వాతాత కొన్ని విషయాలు ఆలోచన చేయాలని, మన ప్రభుత్వం రాకమునుపు పెన్షన్‌ ఎంత ఉంది.. ఇప్పుడు ఎలా ఉంది.., పంపిణీ ఎలా జరుగుతోంది.. అంటూ ప్రశ్నలు వేస్తూ, లబ్ధిదారుల నుంచే సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.

ఈతరహా ప్రచారం వైసీపీకి కాస్త కలిసి వస్తోందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. గత ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి.. గెలుపునకు బాటలు వేసుకున్న జగన్‌, ఈసారి బస్సుయాత్రను ఎంచుకున్నారు. ప్రజలతో నేరుగా భేటీ అవుతున్నారు. ఎలాగైనా మరోసారి అధికారంలోకి రావాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు. మేమంతా సిద్ధం పేరుతో బస్సుయాత్ర ద్వారా నియోజకవర్గాలన్నీ తిరుగుతున్నారు.

బస్సుయాత్ర కొన్నిచోట్ల ఫెయిల్‌ అవుతుండగా, మరికొన్ని చోట్ల ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. వారి ఉత్సాహాన్ని చూసి.. వీలైనచోట్ల ప్రజలను కలుస్తూ, వారితో మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి జగన్‌. స్వయంగా సీఎం మండుటెండలో ప్రచారం చేస్తుండడంతో.. పార్టీ నాయకులు, కార్యకర్తలు, మంత్రులు, అభ్యర్థులు… ఇలా ప్రతిఒక్కరూ ఆయన వెంటే ఉంటున్నారు. వారు కూడా నిరంతరం ప్రజలను కలుస్తూ.. పార్టీని గెలిపించేందుకు కృషి చేస్తున్నారు. మరి వారి కృషి ఎంతవరకు ఓట్లను రాబడుతుందో వేచిచూడాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 5 =