కీలక పథకాలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం

AP Cabinet Decisions, AP Cabinet Decisions 2019, Ap Political Live Updates 2019, Ap Political News, AP Political Updates, AP Political Updates 2019, Mango News Telugu, Minister Perni Nani Press Meet, Minister Perni Nani Press Meet On AP Cabinet, Minister Perni Nani Press Meet On AP Cabinet Decisions, Perni Nani Press Meet On AP Cabinet, Perni Nani Press Meet On AP Cabinet Decisions

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన అక్టోబర్ 30, బుధవారం నాడు సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. నాలుగు గంటల పాటు సాగిన ఈ మంత్రి వర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం ముగిసిన అనంతరం మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు.

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు:

 • 1 నుంచి ఇంటర్మీడియేట్ చదివే విద్యార్థులకు జనవరి 26వ తేదీ నుంచి అమల్లోకి రానున్న ‘అమ్మ ఒడి’ పథకం. ప్రతి ఏడాది జనవరిలో విద్యార్థుల తల్లులకు లేదా సంరక్షకులకు రూ.15 వేలు నగదు ఖాతాల్లో జమ
 • మహిళకు, పిల్లలకు పోషకాహారం అందించే పైలట్‌ ప్రాజెక్టుకు కేబినెట్‌ ఆమోదం. 77 మండలాలలో రూ.90 కోట్లతో ఈ కార్యక్రమం అమలు
 • పలు రంగాల్లో ప్రతిభావంతులకు వైఎస్సార్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులు. జనవరి 26న 50 మందికి, ఆగస్టు 15న 50 మందికి అవార్డుతోపాటు రూ.10 లక్షల బహుమతితో సత్కరణ
 • హజ్‌, జెరూసలేం వెళ్లే యాత్రికులకు ఆర్థిక సాయం పెంపునకు ఆమోదం. రూ.3 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి రూ.40 వేల నుంచి రూ.60వేలకు పెంపు. రూ.3 లక్షల కంటే ఆదాయం ఎక్కువ ఉన్నవారికి రూ.20 వేల నుంచి రూ.30వేలకు పెంపు.
 • షెడ్యూల్ కులాల కార్పోరేషన్ ను మాల , మాదిగ మరియు రెల్లి, ఇతర కులాల ప్రత్యేక కార్పోరేషన్లగా విభజిస్తూ ఆమోదం
 • రాష్ట్రవ్యాప్తంగా 147 నియోజకవర్గాల్లో వైఎస్సార్‌ ఆగ్రి ల్యాబ్‌లు ఏర్పాటు. విత్తనాలు, ఎరువులను ల్యాబ్‌లో పరీక్షించి సరఫరా
 • కోస్తా జిల్లాల్లోని 46 నియోజకవర్గాల్లో ఆక్వా ల్యాబ్‌లు ఏర్పాటు
 • రాష్ట్రంలో ఉన్న ప్రముఖ దేవాలయాల ట్రస్ట్‌ బోర్డుల ఏర్పాటు చట్ట సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం
 • నవంబర్ 7 నుంచి అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపులు, రూ.264 కోట్లు విడుదలకు ఆమోదం
 • గ్రామీణ వార్డు స్థాయిలో అదనపు జెఎల్ఎం పోస్టుల భర్తీకి ఆమోదం
 • హోం శాఖలో అదనపు పోస్టుల భర్తీకి ఆమోదం
 • దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికీ నెలకు రూ.10 వేలు ఆర్థిక సాయం
 • కిడ్నీ వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.5 వేలు సాయం అందించాలని నిర్ణయం
 • 100 చదరపు గజాల్లో ఇంటి నిర్మాణం చేపడితే ఒక్క రూపాయికే రిజిస్ట్రేషన్‌
 • జగ్గయ్యపేట మండలంలోని జయంతిపురం ప్రాంతంలో బాలకృష్ణ వియ్యంకుడికి కేటాయించిన 498.3 ఎకరాల భూకేటాయింపు రద్దు

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 11 =