టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించిన మరో ఆరు జట్లు

16 Teams Decided For T20 World Cup 2020, 2019 Latest Sport News, 2019 Latest Sport News And Headlines, latest sports news, latest sports news 2019, Mango News Telugu, sports news, T20 World Cup 2020, Total 16 Teams Decided For T20 World Cup, Total 16 Teams Decided For T20 World Cup 2020

వచ్చే సంవత్సరం ఆస్ట్రేలియా వేదికగా జరగబోయే టీ20 ప్రపంచకప్‌కు మరో ఆరు జట్లు అర్హత సాధించాయి. ముందుగానే క్వాలిఫయింగ్‌ టోర్నీలో విజయం సాధించి పపుహ న్యూగినియా, ఐర్లాండ్‌, నెదర్లాండ్స్, నమీబియా జట్లు టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించగా, చివరి రెండు స్థానాలను అక్టోబర్ 30, బుధవారం నాడు జరిగిన క్వాలిఫయింగ్‌ టోర్నీ ప్లే ఆఫ్‌ మ్యాచ్‌ల్లో విజయం సాధించిన స్కాట్లాండ్, ఒమన్ జట్లు దక్కించుకున్నాయి. దీనితో 2020 లో జరిగే టీ20 ప్రపంచకప్‌కు మొత్తం పదహారు జట్లు బరిలో ఉండనున్నాయి.

బుధవారం నాడు జరిగిన ప్లే ఆఫ్‌ మ్యాచ్‌ల్లో స్కాట్లాండ్‌ జట్టు 90 పరుగుల తేడాతో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)పై గెలిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన స్కాట్లాండ్‌ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేయగా, యూఏఈ జట్టు 18.3 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌట్ అయింది. ఇప్పటికే 2007, 2009, 2016 టి20 ప్రపంచకప్‌లలో ఆడిన స్కాట్లాండ్‌ జట్టు, ఈ విజయంతో 2020 టి20 ప్రపంచకప్‌ టోర్నీకి కూడ అర్హత సాధించింది. మరో వైపు ఒమన్‌ జట్టు 12 పరుగుల తేడాతో హాంకాంగ్‌ పై విజయం సాధించింది. మొదటగా బ్యాటింగ్ చేసిన ఒమన్‌ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేయగా, హాంకాంగ్‌ జట్టు 9 వికెట్లు కోల్పోయి 122 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here