2047 నాటికి ఏపీలో 50% పచ్చదనం పెంచడమే లక్ష్యం – ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌ నాగబాబు

Naga Babu Assumes Charge As AP Green Executive Committee Chairman

జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ (APGBC) ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసి అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. మంగళగిరిలోని ఏపీజీబీసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ఆయన పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా నాగబాబుకు పలువురు ప్రజాప్రతినిధులు, జనసేన పార్టీ నాయకులు మరియు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.

హరితాంధ్రప్రదేశ్ నిర్మాణమే ప్రధాన లక్ష్యం

బాధ్యతలు స్వీకరించిన అనంతరం నాగబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో పచ్చదనాన్ని విస్తృతంగా పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, నగరాలు మరియు పట్టణాల సుందరీకరణకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా ‘హరితాంధ్రప్రదేశ్’ నిర్మాణం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని స్పష్టం చేశారు.

పచ్చదనం, సుందరీకరణకు ప్రత్యేక ప్రణాళికలు

రాష్ట్రంలో పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు మొక్కల పెంపకం కార్యక్రమాలను మరింత విస్తృతం చేయనున్నట్లు నాగబాబు పేర్కొన్నారు. ప్రధాన నగరాలు, పట్టణాలు మరియు రహదారుల ఇరువైపులా విస్తృతంగా మొక్కలు నాటడంతో పాటు సుందరీకరణ పనులను వేగవంతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు.

ఏపీజీబీసీ ద్వారా పచ్చదనం పెంపకం, పరిశుభ్రత మరియు సుందరీకరణ కార్యక్రమాలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లి రాష్ట్రాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తామని నాగబాబు పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన జీవన వాతావరణాన్ని అందించేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో తనవంతు పాత్ర పోషిస్తానని ఆయన తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here