ఉద్యోగాల నుంచి తొలగించి ఆ 1400 మంది కార్మికుల పొట్ట కొట్టకండి – పవన్ కళ్యాణ్

AP News, janasena chief pawan kalyan, pawan kalyan, Pawan Kalyan Appeals AP Govt and TTD, Pawan Kalyan Appeals TTD Board to Continue 1400 Outsourcing Workers, Pawan Kalyan Latest News, Tirumala Tirupati Devasthanam, TTD, TTD Board, TTD Board 1400 Outsourcing Workers

తిరుమల తిరుపతి దేవస్థానంలో (టీటీడీ) పనిచేస్తున్న 1400 మంది కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించి వారి పొట్ట కొట్టొద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. “కరోనా కారణంగా అల్పాదాయ వర్గాల వారు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న 1400 మంది ఔట్ సోర్సింగ్ కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించడం తీవ్రమైన అన్యాయం. దేశంలో ఏ ఒక్క కార్మికుడినీ ఉద్యోగాల నుంచి తొలగించరాదని, వారికి క్రమం తప్పకుండా వేతనాలు ఇవ్వాలని దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించినప్పటికీ, టీటీడీ పెద్దలు ఒక్క కలం పోటుతో 1400 మంది కార్మికులను విధుల నుంచి తొలగించడం సహేతుకం కాదు. తొలగింపునకు గురైన వారంతా సుమారు 15 సంవత్సరాలుగా పనిచేస్తూ స్వల్ప జీతాలు తీసుకునే చిరుద్యోగులు. టీటీడీ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుని వారందరినీ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి, తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డుకి, కార్యనిర్వహణాధికారికి విజ్ఞప్తి చేస్తున్నానని” పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + four =