తెలంగాణ, ఏపీ హైకోర్టులకు కొత్త సీజేల నియామకంపై సుప్రీంకోర్టు కోలీజియం సిఫారసు

AP High Courts, appointment of high court judges, high court judge appointment process, latest news on appointment of supreme court judges, Mango News, New Chief Justices for Telangana, SC Collegium, SC Collegium recommends 8 names for appointment, SC Collegium Recommends Appointment of New Chief Justices for Telangana, supreme court collegium news today, Supreme Court collegium recommends elevation of 8 chief Justices, Supreme Court collegium recommends new chief justices to AP, Telangana High Courts

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల హైకోర్టులకు నూతన ప్రధాన న్యాయమూర్తులను(సీజే) సుప్రీంకోర్టు కోలీజియం సిఫారసు చేసినట్టు తెలుస్తుంది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం నాలుగు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల బదిలీలకు మరియు 27 మంది హైకోర్టు న్యాయమూర్తుల బదిలీలపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు సిఫారసు చేసినట్టు సమాచారం. ఇందులో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జ‌స్టిస్ సతీశ్‌ చంద్రశర్మ పేరును, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జ‌స్టిస్ ప్ర‌శాంత్ కుమార్ మిశ్రాను సిఫారసు చేసింది.

ముందుగా తెలంగాణ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్‌ హిమా కోహ్లి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అనంతరం తెలంగాణ హైకోర్టులో అత్యంత సీనియర్‌ న్యాయమూర్తిగా ఉన్న రామచంద్రరావు తెలంగాణ హైకోర్టు తాత్కాలిక సీజేగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తిస్థాయి సీజేగా జ‌స్టిస్ సతీశ్‌ చంద్రశర్మ పేరును సిఫారసు చేసినట్టు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఏపీ సీజేగా ఉన్న జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామిని చ‌త్తీస్‌ గడ్ సీజేగా బదిలీ చేసి, ఆయన స్థానంలో ప్రస్తుతం చ‌త్తీస్‌ గడ్ సీజేగా ఉన్న జ‌స్టిస్ ప్ర‌శాంత్ కుమార్ మిశ్రాను ఏపీ సీజేగా నియమించాలని సుప్రీంకోర్టు కోలీజియం సిఫారసు చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − twelve =