ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 103 మున్సిపల్, నగర పంచాయతీల చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు చేశారు. మార్చ్ 8, ఆదివారం నాడు మున్సిపల్ శాఖ కమిషనర్ విజయ్‌కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో 103 మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారు పక్రియ పూర్తయిందని చెప్పారు. ప్రస్తుతం 74 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయని, విలీన, కోర్టు సమస్యల వలన 29 మున్సిపాలిటీల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయని అన్నారు. అలాగే 16 కార్పోరేషన్లకు రిజర్వేషన్లు ఖరారు చేయగా, 12 కార్పోరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. కోర్టు తీర్పు ఆధారంగానే రిజర్వేషన్లు ప్రకటించామని ఆయన పేర్కొన్నారు. కార్పోరేషన్లలో 672 డివిజన్లు, మున్సిపాలిటీల్లో 2,123 వార్డులకు కూడా రిజర్వేషన్స్ ఖరారు చేసినట్టు వెల్లడించారు.
ఏపీలో 103 మున్సిపల్, నగరపంచాయతీ చైర్మన్ల రిజర్వేషన్ల వివరాలు:
- ఎస్టీ మహిళలకు రెండు స్థానాలు
- ఎస్టీ జనరల్ ఒక స్థానం
- ఎస్సీ జనరల్ ఏడు స్థానాలు,
- ఎస్సీ మహిళ ఏడు స్థానాలు
- బీసీ జనరల్ 17 స్థానాలు
- బీసీ మహిళ 17 స్థానాలు
- జనరల్ మహిళ 26 స్థానాలు
- జనరల్ 26 స్థానాలు
[subscribe]