మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు శుక్రవారం దీనిపై విచారించిన ధర్మాసనం కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణ నేపథ్యంలో తన విచారణపై స్టే ఇవ్వాలని కోరుతూ వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. అలాగే ఈ కేసుకు సంబంధించి ఎంపీపై ‘తీవ్ర చర్యలు’ తీసుకోకుండా దర్యాప్తు సంస్థను ఆదేశించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఆయనను అరెస్ట్ చేయొద్దని తాము చెప్పలేమని అవినాష్ రెడ్డికి హైకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది.
ఇక ఈ కేసులో తమ తదుపరి దర్యాప్తు కొనసాగించవచ్చని సీబీఐకి అనుమతి ఇచ్చిన హైకోర్టు, విచారణకు సహకరించాలని ఎంపీ అవినాష్ రెడ్డిని కోరింది. అయితే ఎంపీ విచారణ సందర్భంగా ప్రక్రియ మొత్తాన్ని ఆడియో, వీడియో రికార్డ్ చేయాలని ఆదేశించింది. కానీ విచారణ సందర్భంగా ఎంపీ అవినాష్ రెడ్డి కోరినట్లు ఆయన తరపు న్యాయవాదిని అనుమతించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. కాగా ప్రస్తుతం అవినాష్ రెడ్డి పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనడం కోసం ఢిల్లీలో ఉన్నారు. త్వరలోనే ఆయన మరోసారి సీబీఐ విచారణను ఎదుర్కోనున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేయడం గమనార్హం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE