కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో సీఎం జగన్ భేటీ, రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చ

AP CM YS Jagan Met Union Home Minister Amit Shah and Discussed Various Issues Related to State,AP CM YS Jagan Met Union Home Minister,AP CM YS Jagan Met Amit Shah,AP CM YS Jagan Discussed Various Issues,AP CM YS Jagan on Issues Related to State,Mango News,Mango News Telugu,CM Jagan To Meet Amit Shah,CM Jagan To Meet PM Modi in Delhi,AP CM YS Jagan Meet Amit Shah,Andhra CM Jagan To Call on Amit Shah,AP CM Jagan Mohan Reddy Latest News,YS Jagan Mohan Reddy Delhi News,Union Home Minister Amit Shah,CM Jagan Delhi Visit News Today,Amit Shah Latest News and Updates,Latest Indian Political News

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యారు. పార్లమెంటులోని హోం మంత్రి కార్యాలయంలో అమిత్ షాతో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్ళి, సీఎం చర్చించినట్టు తెలిపారు. అమిత్ షాతో భేటీ అనంతరం సీఎం తన ఢిల్లీ పర్యటనను ముగించుకుని తాడేపల్లికి బయలుదేరారు.

ముందుగా సీఎం వైఎస్ జగన్ గురువారం సాయంత్రం ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉద‌యం ముందుగా వైఎస్సార్సీపీ పార్టీ ఎంపీల‌తో సీఎం స‌మావేశం అయ్యారు. అనంత‌రం ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీతో సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యారు. పార్లమెంటులోని ప్రధానమంత్రి కార్యాలయంలో ఈ సమావేశం జరగగా, ఉమ్మడిఏపీ విభజన హామీల పరిష్కారం, రిసోర్స్ గ్యాప్ ఫండింగ్ విడుదల, రుణ పరిమితి అంశం, పోలవరం ప్రాజెక్టు నిధుల బకాయిలు, ప్రాజెక్టు అంచనాలకు ఆమోదం-అడహాక్ నిధుల విడుదల, తెలంగాణ డిస్కంలనుంచి బకాయిల అంశం, రేషన్ కోటా కేటాయింపు, 12 మెడికల్ కాలేజీలకు అనుమతులు, ఏపీ ఎండీసీకి గనుల కేటాయింపు ఇలా పలు అంశాలపై ప్రధాని మోదీతో సీఎం వైఎస్ జగన్ చర్చలు జరిపి, వినతి పత్రాన్ని అందించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here