రేపు పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వెళ్ళనున్న కేంద్రమంత్రి షెకావత్, సీఎం జగన్

Union Minister Gajendra Singh Shekhawat And AP CM YS Jagan To Inspect Polavaram Project Tomorrow, Union Minister Gajendra Singh Shekhawat, AP CM YS Jagan To Inspect Polavaram Project Tomorrow, Union Minister Gajendra Singh Shekhawat To Inspect Polavaram Project Tomorrow, Union Minister Gajendra Singh Shekhawat, Gajendra Singh Shekhawat, YS Jagan Mohan Reddy And Union Minister To Inspect Polavaram R&R Colonies On March 4, YS Jagan Mohan Reddy And Union Minister To Inspect Polavaram R&R Colonies, YS Jagan Mohan Reddy To Inspect Polavaram R&R Colonies On March 4, Union Minister To Inspect Polavaram R&R Colonies On March 4, YS Jagan Mohan Reddy And Union Minister, AP CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, CM YS Jagan, YS Jagan Mohan Reddy, Union Minister, Polavaram R&R Colonies, Polavaram Project, Inspection Of Polavaram Project, R&R Colonies, Polavaram, Mango News, Mango News Telugu,

కేంద్ర జ‌ల శ‌క్తి శాఖ మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్ రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌ కోసం నేడు ఆంధ్రప్రదేశ్ రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈరోజు రాత్రికి తాడేపల్లిలోని సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి నివాసంలో ఏర్పాటుచేస్తున్న విందును స్వీక‌రించ‌నున్నారు. పోలవరం పర్యటన తర్వాత విజయవాడలో పలు కార్యక్రమాల్లో కేంద్ర మంత్రి పాల్గొంటారని అధికారులు తెలిపారు. రేపు ఉదయం తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరులో పోలవరం ప్రాజెక్టు పునరావాస (ఆర్‌అండ్‌ఆర్‌) కాలనీని పరిశీలించనున్నారు. దీనిపై పోలీసు, ఇతర అధికారులతో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ హరికిరణ్ సమీక్ష నిర్వహించారు. ఇందుకూరు-1 కాలనీలో పునరావాసం పొందిన నిర్వాసిత కుటుంబాలతో షెకావత్ సంభాషిస్తారని కలెక్టర్‌ తెలిపారు.

పోలవరం ప్రాజెక్టు పరిధిలోని ఆర్‌ అండ్‌ ఆర్‌ పనులను సమీక్షించడమే లక్ష్యంగా వీరి క్షేత్ర పర్యటన సాగుతోంది. వివిధ కారణాల వల్ల ఆర్ అండ్ ఆర్ కసరత్తు ఆలస్యమవుతోందని అధికారులు చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టు పురోగతి గురించి స్పిల్‌వే వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా జలశక్తి మంత్రికి వివరించనున్నారు అధికారులు. అనంతరం ఎగువ కాఫర్‌డ్యామ్‌ పనులు, ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ పనులపై పీపీఏ, జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష జరుపనున్నారు. అలాగే, స్పిల్‌ వే, స్పిల్‌ చానల్ పనులను పరిశీలించనున్నారు. కాగా, కేంద్ర మంత్రి పర్యటనకు సంబంధించి అన్ని భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ ఎం.రవీంద్రబాబు తెలిపారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి పోలవరం జాతీయ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాల్సిన ఆవశ్యకతను ప్రధానికి, కేంద్ర మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్ కు వివరించైనా విషయం తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × four =