ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా, కొత్త షెడ్యూల్ వివరాలు ఇవే…

Andhra Pradesh New Schedule Released for Intermediate Public Exams-2022, AP New Schedule Released for Intermediate Public Exams -2022, AP Education Department Revises Intermediate 2022 Schedule Amid JEE Mains Clash, Education Department Revises Intermediate 2022 Schedule Amid JEE Mains Clash, AP Education Department Revises Intermediate 2022 Schedule, AP Education Department, JEE Mains, AP Intermediate Public Exams-2022 Schedule Revised, Intermediate Public Exams-2022 Schedule Revised, AP Intermediate Public Exams-2022, Intermediate Public Exams-2022, Schedule Revised, Andhra Pradesh Education Department, new dates for the Andhra Pradesh Intermediate examinations, Andhra Pradesh Intermediate examinations, Intermediate Public Exams, Intermediate Public Exams Latest News, Intermediate Public Exams Latest Updates, Intermediate Public Exams Live Updates, 2022 Intermediate Public Exams, Intermediate Public Exams-2022 Schedule, 2022 Intermediate Public Exams Schedule Revised, 2022 Intermediate Public Exams Schedule, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 28 వరకు ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు నిర్వహించేలా ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇటీవల షెడ్యూల్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే జేఈఈ మెయిన్స్ మొదటి దశ పరీక్షలను ఏప్రిల్ 16 నుంచి 21 వరకు నిర్వహించనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తాజాగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో గత షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన ఇంటర్ వార్షిక పరీక్షలను వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించే కొత్త తేదీలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ గురువారం నాడు ప్రకటించారు .

కొత్త షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 22 నుంచి మే 11 వరకు ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు, ఏప్రిల్ 23 నుంచి మే 12వరకు ఇంటర్‌ రెండవ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నారు. అన్ని పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య జరగనున్నాయి. అలాగే జనరల్, ఒకేషనల్ కోర్సులకు మార్చి 11 నుంచి మార్చి 31 వరకు ప్రాక్టికల్‌ పరీక్షలు జరగనున్నాయి. ఇక మార్చి 7 వ ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు తేదీన నైతిక, మానవ విలువల పరీక్ష మరియు మార్చి 9న ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు పర్యావరణ విద్య పరీక్ష నిర్వహిస్తామని షెడ్యూల్లో పేర్కొన్నారు.

ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల షెడ్యూల్:

 • ఏప్రిల్ 22: సెకండ్ లాంగ్వేజ్ పేపర్- 1
 • ఏప్రిల్ 25: ఇంగ్లీష్ పేపర్-1
 • ఏప్రిల్ 27: మ్యాథమేటిక్స్ పేపర్- 1A, బోటనీ పేపర్- 1, సివిక్స్ పేపర్- 1,
 • ఏప్రిల్ 29: మ్యాథమేటిక్స్ పేపర్-1B, జువాలజీ పేపర్ -1, హిస్టరీ పేపర్ -1
 • మే 2: ఫిజిక్స్ పేపర్ -1, ఎకనామిక్స్ పేపర్ -1
 • మే 6: కెమిస్ట్రీ పేపర్ -1, కామర్స్ పేపర్ -1, సోషియాలజీ పేపర్ -1, ఫైనర్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ -1
 • మే 9: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -1, లాజిక్ పేపర్ -1, బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ పేపర్ -1 (బైపిసి విద్యార్థులకు)
 • మే 11: మోడరన్ లాంగ్వేజ్ పేపర్ -1 మరియు జాగ్రఫీ పేపర్ -1.

ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షల షెడ్యూల్:

 • ఏప్రిల్ 23: సెకండ్ లాంగ్వేజ్ పేపర్- 2
 • ఏప్రిల్ 26: ఇంగ్లీష్ పేపర్ -2
 • ఏప్రిల్ 28: మ్యాథమేటిక్స్ పేపర్- 2A, బోటనీ పేపర్- 2, సివిక్స్ పేపర్- 2
 • ఏప్రిల్ 30: మ్యాథమెటిక్స్ పేపర్- 2B, జువాలజీ పేపర్- 2, హిస్టరీ పేపర్- 2
 • మే 5: ఫిజిక్స్ పేపర్-2, ఎకనామిక్స్ పేపర్-2
 • మే 7: కెమిస్ట్రీ పేపర్-2, కామర్స్ పేపర్ -2, సోషియాలజీ పేపర్-2, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ -2
 • మే 10: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -2, లాజిక్ పేపర్ -2, బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ పేపర్ -2
 • మే 12: మోడరన్ లాంగ్వేజ్ పేపర్ -2, జాగ్రఫీ పేపర్ -2.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − seven =