ఏపీ లో నేటి నుంచి రిలే దీక్షలు చేయనున్న ఉద్యోగులు

Andhra govt employees strike over pay revision, Andhra Pradesh Government, Andhra Pradesh govt employees, Andhra PRC row, AP employees firm on their demands, AP Employees Ready To Be Relay Initiations From Today Regarding PRC Issue, AP employees say cancel PRC, AP employees threaten strike, AP Employees Unions Calls For Strike From February 7 Regarding PRC Issue, AP government staff intensify stir against new payscales, Employees Ready To Be Relay Initiations From Today Regarding PRC Issue, Mango News, PRC Issue, PRC Issue in Ap

ఆంధ్రప్రదేశ్ లో పీఆర్సీ సాధన ఉద్యమ కార్యాచరణలో భాగంగా గురువారం నుంచి నాలుగు రోజుల పాటు స్థానిక ఏపీఎన్జీవో హోమ్‌ వద్ద రిలేనిరాహార దీక్ష చేపట్టనున్నట్టు ఉద్యోగ సంఘ నాయకులు తెలిపారు. ఈ మేరకు బుధవారం స్థానిక రెవెన్యూ గెస్ట్‌హౌస్‌లో రిలే నిరాహార దీక్షల సన్నాహక సమావేశాన్ని పీఆర్సీ సాధన సమితి ఆధ్యర్యంలో నిర్వహించారు. విజయవాడ ధర్నా చౌక్ లో రిలే దీక్షలో రాష్ట్ర నేతలు పాల్గొననున్నారు. రిలే నిరాహార దీక్షల్లో అన్ని స్థాయిల ఉద్యోగులు పాల్గొనేలా ప్రణాళికను రూపొందించామని జేఏసీ నేతలు చెప్పారు.

ప్రతి రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ రిలే దీక్ష కొనసాగుతుందన్నారు. ఈ రిలే దీక్షకు మద్దతుగా జిల్లా నలుమూలల నుంచి ఉద్యోగులు తరలిరానున్నట్టు స్పష్టం చేశారు. అయితే, ఇదిలా ఉండగా ఉద్యోగ సంఘాలను మరోసారి చర్చలకు ఆహ్వానించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. సమస్యలను సామసర్య పూర్వకంగా పరిష్కరించుకుందామని సూచించింది. ఈరోజు చర్చలకు రావాలని మంత్రుల కమిటీ పిలుపునిచ్చింది. అయితే, పీఆర్సీ జీవోలు రద్దు చేసేవరకూ చర్చలకు వెళ్లేది లేదని స్టీరింగ్ కమిటీ తేల్చి చెబుతోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ జిల్లాలో జరిగే రిలే దీక్షలకు హాజరుకావాలని జేఏసీ నేతలు కోరారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × three =