పవన్ కళ్యాణ్ పై విజయసాయి రెడ్డి విమర్శలు

AP Political Live Updates 2019, Ap Political News, AP Political Updates, AP Political Updates 2019, Janasena Pawan Kalyan Latest News, Mango News Telugu, Vijayasai Reddy Comments On Pawan Kalyan, Vijayasai Reddy Comments On Pawan Kalyan In Twitter, Vijayasai Reddy Controversial Comments On Pawan, Vijayasai Reddy Controversial Comments On Pawan Kalyan

వైసీపీ పార్టీ నాయకుడు, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేసారు. కొంతమంది చేసే చౌక బారు ప్రచారంలో పవన్ కళ్యాణ్ పావుగా మారకుండా, నిర్మాణాత్మకమైన విమర్శలు చేయాలనీ హితవు పలికారు. ఇటీవల వైసీపీ ప్రభుత్వంపై పలు సందర్భాలలో పవన్ కళ్యాణ్ చేస్తున్న విమర్శలను విజయసాయి రెడ్డి తప్పుపట్టారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న ధైర్యమైన నిర్ణయాలతో ప్రజా ధనం వృధా కాదని, ఈ విధానాలతో పారదర్శకతలో దేశానికి కొత్త దిశను చూపుతామని పేర్కొన్నారు.

మరో వైపు టీడీపీ పార్టీపై సైతం ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర విమర్శలు చేసాడు. టీడీపీ పార్టీ అనవసరంగా వైసీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తుందని విమర్శించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని విజయసాయి రెడ్డి కొనియాడారు. ఈ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఆర్టీసీ సంస్థ మరియు సంబంధిత ఉద్యోగులకు మెరుగైన భవిష్యత్ అందిస్తుందని తెలిపారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాత్రం ఎప్పుడూ ఆర్టీసీ ఆస్తులను అమ్మడానికే ప్రయత్నం చేసారని విమర్శించారు.

 

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here