టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా పలువురు పార్టీ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పార్టీ కార్యకర్తలు అనేకచోట్ల టీడీపీ కార్యాలయాల్లో కేక్ కట్ చేసి లోకేష్ జన్మదిన వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్‌కు ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని కీలక నాయకుడు, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి బర్త్ డే విషెస్ చెప్పారు. ఈ మేరకు ఎంపీ ట్విటర్ వేదికగా లోకేష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘నారా లోకేష్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. వేంకటేశ్వర స్వామి ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నా’ అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.
Extending Birthday wishes to @naralokesh. May Lord Venkateswara bless him with a long and healthy life.
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 23, 2023
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE