అండమాన్ నికోబార్ లోని 21 దీవులకు పరమవీర్ చక్ర అవార్డు గ్రహీతల పేర్లు పెట్టిన ప్రధాని మోదీ

PM Modi Names 21 Largest Unnamed Islands of Andaman And Nicobar Islands after 21 Param Vir Chakra Awardees,PM Modi name Paramveer Chakra awardees,Paramveer Chakra for 21 islands,Paramveer Chakra in Andaman and Nicobar,Mango News,Mango News Telugu,Param Vir Chakra Winners List 2022,Param Vir Chakra Winners List Pdf,Param Vir Chakra Last Winner,Param Vir Chakra Winners Alive,Param Vir Chakra Winners List 2021,Param Vir Chakra Essay In English,Param Vir Chakra Award Winners,Param Vir Chakra Winners List With Years,Param Vir Chakra Awarded List,Name Of Param Vir Chakra Winners,Param Vir Chakra Winners List,Param Vir Chakra Winners List In English

స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జన్మదినమైన జనవరి 23వ తేదీని ప్రతి సంవత్సరం ‘పరాక్రమ్ దివస్’గా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరాక్రమ్ దివస్ సందర్భంగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు(జనవరి 23, సోమవారం) వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా అండమాన్ నికోబార్ దీవులలోని పేరు పెట్టని 21 పెద్ద దీవులకు 21 మంది పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేరు పెట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ద్వీపంలో నిర్మించనున్న నేతాజీకి అంకితం చేసిన జాతీయ స్మారక నమూనాను కూడా ప్రధాని మోదీ ఆవిష్కరించారు.

మేజర్ సోమనాథ్ శర్మ, సుబేదార్ మరియు హోనీ కెప్టెన్ (అప్పటి లాన్స్ నాయక్) కరమ్ సింగ్ ఎంఎం, 2వ లెఫ్టినెంట్ రామ రఘోబా రాణే, నాయక్ జాదునాథ్ సింగ్, కంపెనీ హవల్దార్ మేజర్ పిరు సింగ్, కెప్టెన్ జిలా సలారియా, లెఫ్టినెంట్ కల్నల్ (అప్పటి మేజర్) ధన్ సింగ్ థాపా; సుబేదార్ జోగిందర్ సింగ్, మేజర్ షైతాన్ సింగ్, సీక్యూఎంహెఛ్. అబ్దుల్ హమీద్, లెఫ్టినెంట్ కల్నల్ అర్దేషిర్ బుర్జోర్జీ తారాపూర్, లాన్స్ నాయక్ ఆల్బర్ట్ ఎక్కా, మేజర్ హోషియార్ సింగ్, 2వ లెఫ్టినెంట్ అరుణ్ ఖేత్రపాల్, ఫ్లయింగ్ ఆఫీసర్ నిర్మల్‌జిత్ సింగ్ సెఖోన్, మేజర్ రామస్వామి పరమేశ్వరన్, నాయబ్ సుబేదార్ బనా సింగ్, కెప్టెన్ విక్రమ్ బాత్రా, లెఫ్టినెంట్ మనోజ్ కుమార్ పాండే, సుబేదార్ మేజర్ (అప్పటి రైఫిల్‌మ్యాన్) సంజయ్ కుమార్ మరియు సుబేదార్ మేజర్ రిటైర్డ్ (హానీ కెప్టెన్) గ్రెనేడియర్ యోగేంద్ర సింగ్ యాదవ్ వంటి 21 మంది పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేర్లను అండమాన్ నికోబార్ దీవులలోని 21 ద్వీపాలకు పెట్టారు.

అండమాన్ అండ్ నికోబార్ దీవుల చారిత్రక ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జ్ఞాపకార్థం 2018లో ప్రధాని మోదీ తన పర్యటన సందర్భంగా రాస్ ఐలాండ్స్ పేరును నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీప్‌గా మార్చారు. నీల్ ద్వీపం మరియు హేవ్‌లాక్ ద్వీపాన్ని షహీద్ ద్వీప్ మరియు స్వరాజ్ ద్వీప్ గా పేరు మార్చారు. దేశంలోని నిజ జీవిత హీరోలకు సముచిత గౌరవం ఇవ్వడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, ఈ దిశగా ప్రధాని నిర్ణయం తీసుకున్నారు. ఈ స్ఫూర్తితో ముందుకు వెళుతూ, ఇప్పుడు అండమాన్ నికోబార్ ద్వీప సమూహంలోని 21 పేరులేని పెద్ద దీవులకు 21 మంది పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేరు పెట్టాలని నిర్ణయించారు. పేరులేని అతిపెద్ద ద్వీపానికి మొదటి పరమవీర చక్ర అవార్డు గ్రహీత పేరు పెట్టబడింది. అలాగే రెండవ అతిపెద్ద ద్వీపానికి రెండవ పరమవీర చక్ర అవార్డు గ్రహీత పేరు పెట్టబడింది. దేశ సార్వభౌమాధికారం మరియు సమగ్రతను కాపాడేందుకు అంతిమ త్యాగం చేసిన మన వీరులకు ఈ నిర్ణయం శాశ్వత నివాళి అవుతుందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ప్ర‌ధాని మోదీ ప్ర‌సంగిస్తూ, ప‌రాక్ర‌మ్ దివ‌స్ సంద‌ర్భంగా ప్ర‌తి ఒక్క‌రికీ శుభాకాంక్ష‌లు తెలిపారు మరియు నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ జ‌యంతి సంద‌ర్భంగా దేశ‌వ్యాప్తంగా ఈ స్ఫూర్తిదాయ‌క దినాన్ని జ‌రుపుకుంటున్నార‌ని పేర్కొన్నారు. అండమాన్ అండ్ నికోబార్ దీవులకు ఈ రోజు ఒక చారిత్రాత్మకమైన రోజు అని పేర్కొన్న ప్రధాని, “చరిత్రను రూపొందిస్తున్నప్పుడు, భావి తరాలు దానిని గుర్తుంచుకోవడం, అంచనా వేయడం మరియు మూల్యాంకనం చేయడం మాత్రమే కాకుండా, దాని నుండి నిరంతరం స్ఫూర్తిని పొందుతాయి” అని అన్నారు. అండమాన్ అండ్ నికోబార్ దీవుల నుండి 21 దీవులకు పేరు పెట్టే కార్యక్రమం నేడు జరుగుతోందని, అవి ఇప్పుడు 21 మంది పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేర్లుగా గుర్తించబడతాయని ప్రధాని తెలియజేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ బస చేసిన ద్వీపంలో కొత్త స్మారకం శంకుస్థాపన జరుగుతోందని, ఆజాదీ కా అమృత్‌ కాల్ లో ఈ రోజు ఒక ముఖ్యమైన అధ్యాయంగా భావి తరాలకు గుర్తుంటుందని వ్యాఖ్యానించారు. నేతాజీ స్మారక చిహ్నం మరియు కొత్తగా పేరు పెట్టబడిన 21 ద్వీపాలు యువ తరాలకు నిరంతర ప్రేరణగా నిలుస్తాయని ప్రధాని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 2 =