ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన సీఎం జగన్

AP CM YS Jagan Finalizes 3 Candidates For MLC, AP CM YS Jagan Finalizes 3 Candidates For MLC By-elections, AP MLC By-elections, AP News, CM YS Jagan Finalizes 3 Candidates For MLC, Jagan Finalizes 3 Candidates For MLC, latest news, latest news today, latest telugu news, Mango News Telugu, MLC By-elections, YS Jagan Finalizes 3 Candidates For MLC, YS Jagan Finalizes 3 Candidates For MLC By-elections

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు అధికార వైసీపీ పార్టీ తన అభ్యర్థులను ఖరారు చేసింది. వైఎస్‌ఆర్‌సిపి అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మోపిదేవి వెంకటరమణ, మహ్మద్ ఇక్బాల్, చల్లా రామకృష్ణారెడ్డి పేర్లను ఖరారు చేశారు. మోపిదేవి వెంకటరమణ మంత్రిగా కొనసాగుతుండగా, ఇక్బాల్ హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. గతంలోనే ఇక్బాల్ కు ఎమ్మెల్సీ ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఇక బనగాన పల్లెలో వైసీపీ విజయానికి పాటుపడిన చల్లా రామకృష్ణారెడ్డి ని మరో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంచుకున్నారు. పేర్లు ఖరారైనప్పటికీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ నాయకుడు కరణం బలరాం, వైసీపీ నాయకులు కోలగట్ల వీరభద్రస్వామి, ఆళ్ల నాని ఎమ్మెల్యేలుగా గెలుపొంది, ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయడంతో 3 స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉప ఎన్నికలు ఆగస్టు 26 న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతాయి, అదే రోజు సాయంత్రం కౌంటింగ్ కూడ జరగనుంది. నామినేషన్లు దాఖలు చేయడానికి ఆగస్టు 14 చివరి తేదీగా నిర్ణయించారు. ఆగస్టు 16న నామినేషన్ లను పరిశీలిస్తారు, ఆగస్టు 19 వరకు నామినేషన్లు ఉపసంహరణకు గడువు ఇచ్చారు. తెలంగాణాలో కూడ ఒక స్థానానికి ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు జరగనున్నాయి.

 

[subscribe]
[youtube_video videoid=_l4d842NGrk]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + fifteen =