తెరుచుకున్న శ్రీశైలం, నాగార్జున సాగర్ గేట్లు

Mango News Telugu, Nagarjuna Sagar, nagarjuna sagar dam, nagarjuna sagar dam gates, nagarjuna sagar dam videos, nagarjuna sagar dam water level, Nagarjuna Sagar Gates Lifted, Nagarjuna Sagar Gates Lifted On Sunday, Srisailam, srisailam dam, Srisailam Gates Lifted, Srisailam Nagarjuna Sagar, Srisailam Nagarjuna Sagar Gates Lifted, Srisailam Nagarjuna Sagar Gates Lifted On Sunday, Telangana Latest News, Telangana News, telangana updates, telugu news

మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి వస్తున్న వరద ప్రవాహంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ లకు భారీగా నీరు వచ్చి చేరుతుంది. ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి భారీస్థాయిలో వరద నీరు వస్తుంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులలో వరద ఉదృతి కొనసాగడంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేయాలనీ నిర్ణయించుకున్నారు. శ్రీశైలం లో 10 గేట్లు, నాగార్జున సాగర్ లో 20 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలంలో 885 అడుగుల నీటిమట్టానికి గానూ, 878 అడుగులవరకు నీరు చేరుకోవడంతో 10 గేట్లు ఎత్తి నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగుల కాగా, ప్రస్తుతం 559 అడుగులకు చేరుకోవడంతో అధికారులు 20 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.

మరో వైపు తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల మంత్రి అనిల్ కుమార్ ఆదివారం ఉదయమ 11.40 నిముషాలకు నాగార్జున సాగర్ జలాశయం నుండి ఎడమ కాలువకు నీటిని విడుదల చేసారు. అతి త్వరలోనే కుడి కాలువ కింద ఉన్న ఆయకట్టు భూములకు కూడ నీటిని విడుదల చేయనున్నట్టు మంత్రి అనిల్ కుమార్ తెలిపారు. నవంబర్ నుండి తిరిగి పోలవరం ప్రాజెక్ట్ పనులను చేపడతామని ఈ సందర్భంగా తెలియజేసారు. మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ పక్క రాష్ట్రాలతో మంచి సంబంధాలు కలిగిఉంటే ప్రజలుకు మంచి జరుగుతుందని చెప్పారు. నాగార్జున సాగర్లో నీటిని విడుదల చేసేందుకు గేట్లు ఎత్తడంతో పర్యాటకుల సందడి మొదలయింది. చుట్టుపక్కల ప్రాంతాల నుండి నీటి ప్రవాహాన్ని చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో నాగార్జున సాగర్ కి వస్తున్నారు.

 

[subscribe]
[youtube_video videoid=zsZKEb2u-R8]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − six =