స్పీకర్‌ ఓం బిర్లాను కలిసిన వైసీపీ ఎంపీలు, రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు

Andhra Pradesh AP CM YS Jagan, Andhra Pradesh CM Jagan, AP News, AP Political Updates, disqualification petition On MP Raghu Rama Krishnam Raju, Loksabha Speakar Om Birla, MP Raghu Rama Krishnam Raju, Om Birla, YSRCP MPs hand over disqualification petition to Om Birla, YSRCP MPs Meet Loksabha Speakar

లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను జూలై 3, శుక్రవారం నాడు వైస్సార్సీపీ ఎంపీల బృందం కలిసింది. ఈ సందర్భంగా నర్సాపురం వైస్సార్సీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఎంపీల బృందం స్పీకర్‌ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసింది. పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని పేర్కొంటూ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని ఎంపీల బృందం స్పీకర్ ను కోరింది. స్పీకర్ ను కలిసిన వారిలో వైస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి, లోక్‌సభ పక్షనేత మిథున్ రెడ్డి, ఎంపీలు మార్గాని భరత్‌, నందిగం సురేష్, లావు శ్రీకృష్ణదేవరాయలు, తదితరులు ఉన్నారు. ఎంపీ రఘు రామకృష్ణ రాజుకు వైస్సార్సీపీ ఇటీవలే షోకాజ్ నోటీసు కూడా జారీ చేసిన సంగతి తెలిసిందే.

మరోవైపు ఎంపీ రఘురామకృష్ణరాజు ఈ రోజు హైకోర్టును ఆశ్రయించారు. తనపై పార్టీ చేపట్టే అనర్హత వేటు, సస్పెన్షన్‌ చర్యలు అడ్డుకోవాలని ఆయన పిటిషన్‌ దాఖలు చేశారు. తాను పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి చర్యలకు పాల్పడలేదని పిటిషన్‌లో పేర్కొన్నట్టు తెలుస్తుంది. కాగా రఘురామకృష్ణరాజు పిటిషన్‌ జూలై 6, సోమవారం నాడు విచారణకు వచ్చే అవకాశమునట్టు సమాచారం.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here