ఆగస్టు 15 నాటికీ “కొవాగ్జిన్‌” వచ్చే అవకాశం? తెలుగు రాష్ట్రాల్లో క్లినికల్‌ ట్రయల్స్‌ సెంటర్లు ఇవే

coronavirus vaccine, Coronavirus Vaccine COVAXIN, COVAXIN, COVID 19 Vaccine, ICMR, ICMR to Launch Covaxin, ICMR’s COVID-19 vaccine COVAXIN, India Coronavirus Vaccine, India to launch Covid-19 vaccine, Indian Council of Medical Research, Indian Council of Medical Research Plans to Launch Covaxin

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లోని ఫార్మా కంపెనీలు కరోనా నియంత్రణ కోసం వాక్సిన్ తయారీలో నిమగ్నమయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ తయారీకి సంబంధించి భారత్‌ బయోటెక్‌ ఇండియా లిమిటెడ్ కీలక దశకు చేరుకుంది. “కొవాగ్జిన్‌” పేరుతో భారత్‌ బయోటెక్‌, భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌), పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ) సంయుక్తంగా తయారుచేస్తున్న ఈ వ్యాక్సిన్‌ ను మానవులపై ఫేజ్‌-1, ఫేజ్‌-2 ప్రయోగాలు చేసేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి ఇచ్చింది. జూలై నుంచి దేశం అంతటా ఈ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కానున్నట్లు భారత్‌ బయోటెక్ వెల్లడించింది. కరోనా కట్టడికి దేశంలో తయారవుతున్న తోలి ఔషధం ఇదే కావడం విశేషం.

అయితే కొవాగ్జిన్‌ తో మునుషులపై చేసే ప్రయోగాలు విజయవంతమైతే, ఆగస్ట్‌ 15 నాటికి కొవాగ్జిన్ ను మార్కెట్లోకి విడుదల చేసే అవకాశమున్నట్టు ఉహిస్తున్నామని ఐసీఎంఆర్‌ వెల్లడించింది. లక్ష్యాన్ని చేరుకోవడానికి భారత్‌ బయోటెక్‌ ఇండియా లిమిటెడ్ వేగంగా పనిచేస్తోంది, అయితే తుది ఫలితం క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం ఎంపిక చేసిన 12 సంస్థల సహకారం ఆధారపడి ఉంటుందని ఐసీఎంఆర్‌ వెల్లడించింది. కరోనా వ్యాప్తి రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా వ్యాక్సిన్ రావాల్సి అందుకు కావల్సిన అనుమతులన్నింటినీ వేగంగా పొందాలని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. మరోవైపు కొవాగ్జిన్‌ క్లినికల్ ట్రయల్స్ కోసం తెలుగు రాష్ట్రాల్లో రెండు సెంటర్లను ఐసీఎంఆర్‌ ఎంపిక చేసింది. ఆంధ్రప్రదేశ్ లో విశాఖ కేజీహెచ్‌ ఆస్పత్రిని, తెలంగాణలో హైదరాబాద్‌ లోని నిమ్స్‌ ఆస్పత్రిని ఎంపిక చేశారు.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + nine =